- Telugu News Photo Gallery Political photos Pawan Kalyan financial assistance to the family of farmer Annapureddy Rajasekhar Reddy in Dharmavaram Photos
Pawan Kalyan: అనంతపురం జిల్లాలో కౌలు రైతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్ధిక సాయం
అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ కేంద్రం శివనగర్ ప్రాంతానికి చెందిన కౌలు రైతు శ్రీ అన్నపురెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల బలవన్మరణానికి పాల్పడ్డారు.
Updated on: Apr 12, 2022 | 1:18 PM

అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ కేంద్రం శివనగర్ ప్రాంతానికి చెందిన కౌలు రైతు శ్రీ అన్నపురెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల బలవన్మరణానికి పాల్పడ్డారు.

జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ధర్మవరంలో శ్రీ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.

శ్రీ రాజశేఖర్ రెడ్డి మరణానికిగల కారణాలు అడిగి తెలుసుకున్నారు.

జనసేన పార్టీ తరఫున ప్రకటించిన లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని చెక్ రూపంలో ఆయన భార్య శ్రీమతి చంద్రకళకు అందజేశారు.

శ్రీ రాజశేఖర్ రెడ్డికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

వారి విద్య బాధ్యతలను కూడా జనసేన పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు.

శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పిఏసీ సభ్యులు శ్రీ నాగబాబు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి. వరణ్ తదితరులు పాల్గొన్నారు.
