Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ సరికొత్త వ్యూహం.. పిఠాపురంపై ఫుల్ ఫోకస్..
నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది? పార్టీకి ఎవరు బలం? ఎవరు నష్టం? భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లాలనే దానిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఆయన అమలుచేసిన ఆ కొత్త వ్యూహమేంటి?.. లాంటి వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి..

నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది? పార్టీకి ఎవరు బలం? ఎవరు నష్టం? భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లాలనే దానిపై పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఆయన అమలుచేసిన ఆ కొత్త వ్యూహమేంటి?.. లాంటి వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి.. 2024 ఎన్నికల్లో వంద శాతం విజయం సాధించి.. దేశ చరిత్రలోనే జనసేన రికార్డ్ సృష్టించింది. ఆ పార్టీ అధినేత పవన్.. పిఠాపురం వేదికగా అసెంబ్లీకి వెళ్లి డిప్యూటీ సీఎం అయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న పవన్.. నియోజకవర్గంపై పూర్తి స్థాయి ఫోకస్ పెట్టలేని పరిస్థితి. కార్యకర్తలకు సమయం కేటాయించడానికి కూడా వీలు పడటం లేదు. వీటిని అధిగమించేందుకు సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు పవన్. దీని కోసం గ్రామ కమిటీలు వేయాలని నిర్ణయించారు. నేతతో కార్యకర్త అనే పేరుతో కమిటీలు వేయబోతున్నారు.
కొత్త, పాత నేతలతో కమిటీల ఏర్పాటు
కొత్త, పాత నేతలతో ఈ కమిటీలు ఏర్పాటు కాబోతున్నాయి. గ్రామాన్ని బట్టి ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు ఈ కమిటీలో ఉంటారు. ఈ కమిటీల ఎంపిక బాధ్యతను నలుగురికి పార్టీ అప్పగించింది. అందులో ఎంపీ తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్ ఒకరు. పిఠాపురం అభివృద్ధితో పాటు కూటమి బలోపేతం కోసమే ఈ కమిటీ అని..పేర్కొంటున్నారు నాయకులు..
అధికారులు.. నాయకుల తీరు తెలుసుకునేందుకు కమిటీలు వేస్తున్నట్లు జనసేన నాయకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
నియోజకవర్గంలో నాయకులు, అధికారుల ప్రవర్తనను తెలుసుకునేందుకు కమిటీలు వేస్తున్నారు జనసేన అధినేత పవన్. ఈ కమిటీలను స్వయంగా పవనే మానిటరింగ్ చేస్తారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
