సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
విశాఖ ఉత్సవాల్లో భాగంగా సెంట్రల్ పార్క్‌లో ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దేశీయ, విదేశీ అరుదైన పూలతో అలంకరించిన ఈ ప్రదర్శనలో కనక మహాలక్ష్మి అమ్మవారి పుష్ప అలంకరణ, శివపార్వతుల సైకత శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉచిత ప్రవేశంతో పెద్ద సంఖ్యలో నగరవాసులు, పర్యాటకులు తరలివస్తున్నారు. ఈ మూడు రోజుల పూల ప్రదర్శన విశాఖ ఉత్సవాలకు మరింత శోభను తీసుకొచ్చింది.
విశాఖ నగరంలో ఘనంగా జరుగుతున్న విశాఖ ఉత్సవాల్లో భాగంగా సెంట్రల్ పార్క్‌లో ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రంగురంగుల పూలతో అలంకరించిన ఈ ఫ్లవర్ షోను ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విఎంఆర్‌డీఏ కమిషనర్ తేజ్ భరత్ పాల్గొన్నారు. బెంగళూరు, కోల్‌కతాతో పాటు తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి తెప్పించిన అరుదైన పుష్పాలతో సెంట్రల్ పార్క్‌ను ముస్తాబు చేశారు. దేశీయ, విదేశీ రకాల పూలతో మూడు రోజుల పాటు ఈ ఫ్లవర్ షో నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన పూల అలంకరణలు సందర్శకులకు కనువిందు చేస్తూ ఉత్సవాల సందడిని మరింత పెంచుతున్నాయి. ఫ్లవర్ షోలో ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి పుష్ప అలంకరణ, శివపార్వతుల సైకత శిల్పాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వీటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో నగరవాసులు, పర్యాటకులు తరలివస్తున్నారు. పిల్లలు, యువత, మహిళలు ఉత్సాహంగా ఫ్లవర్ షోను సందర్శిస్తూ ఫోటోలు, సెల్ఫీలతో సందడి చేస్తున్నారు. విశాఖ ఉత్సవాల సందర్భంగా సెంట్రల్ పార్క్‌లో ఫ్లవర్ షోకు ఉచిత ప్రవేశం కల్పించడంతో ప్రజలు మరింత ఆసక్తిగా తరలివస్తున్నారు. పూల సువాసన, కళాత్మక అలంకరణల మధ్య సాగుతున్న ఈ ప్రదర్శన విశాఖ ఉత్సవాలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చిందని నిర్వాహకులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యాదగిరిగుట్టలో ఏం జరిగింది.. బంగారు, వెండి డాలర్లు ఎక్కడ?
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా.. వేట చూస్తే మైండ్ బ్లాక్
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా

