Pawan Kalyan: వారాహి యాత్రలో ముద్రగడకు వ్యతిరేకంగా పోస్టర్లు.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఏంటంటే?
ముద్ర..రగడపై ఊహించనివిధంగా రియాక్టయ్యారు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. కాక పుట్టించే కామెంట్స్‌తో చెలరేగిపోతారనుకుంటే కార్యకర్తలకు సుద్దులు చెప్పారు. పెద్దల్ని గౌరవిద్దాం అంటూనే సెటైరికల్ టచ్ ఇచ్చారు పవన్. గతానికి భిన్నంగా ముద్రగడపై రియాక్టయ్యారు జనసేన చీఫ్.
ముద్ర..రగడపై ఊహించనివిధంగా రియాక్టయ్యారు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. కాక పుట్టించే కామెంట్స్‌తో చెలరేగిపోతారనుకుంటే కార్యకర్తలకు సుద్దులు చెప్పారు. పెద్దల్ని గౌరవిద్దాం అంటూనే సెటైరికల్ టచ్ ఇచ్చారు పవన్. గతానికి భిన్నంగా ముద్రగడపై రియాక్టయ్యారు జనసేన చీఫ్. ముద్రగడ పద్మనాభం వర్సెస్ పవన్ కల్యాణ్, వీళ్లిద్దరి మధ్య ఫైట్-ఏపీ పొలిటికల్ రిక్టర్ స్కేల్‌పై పెను ప్రకంపనలు సృష్టించాయ్. ఒక్క మాటా మాట్లాడకుండానే పవన్‌ను ఏకిపారేశారు ముద్రగడ. పవన్ టార్గెట్‌గా ముద్రగడ సంధించిన లేఖలు కల్లోలం రేపాయ్. పవన్… రౌడీ భాష మార్చుకో!, నీ అభిమానుల్ని కంట్రోల్‌లో పెట్టుకో! నీకు దమ్ముంటే నాపై పోటీ చెయ్! అంటూ సవాళ్లు విసిరారు. ముద్రగడ వైపు నుంచి ఘాటైన విమర్శలు వస్తున్నా నోరు మెదపని పవన్ ఫస్ట్ టైమ్ రియాక్టయ్యారు. అది కూడా పాజిటివ్‌గా!. ముద్రగడను గౌరవించాలంటూ తన అభిమానులకు పిలుపునిచ్చారు పవన్. మలికిపురం సభలో ఈ ఆసక్తికర సీన్ కనిపించింది. కులద్రోహి అంటూ ముద్రగడకు వ్యతిరేకంగా బ్యానర్లు ప్రదర్శించడంతో పవన్ రియాక్టయ్యారు. వెంటనే ఆ బ్యానర్లను తీసేయాలని సూచించారు. పెద్దలేదో అంటుంటారు!, మనం తీసుకోవాలి అంతే!, ఇలాంటివి మాత్రం వద్దన్నారు! దాంతో, ముద్రగడకు వ్యతిరేకంగా పెట్టిన ప్లకార్డులు, బ్యానర్లను తీసేశారు కార్యకర్తలు.
ఇక, ఎప్పటిలాగే జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు పవన్. 2024లో మళ్లీ వైసీపీ గెలిచే ఛాన్సే లేదన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవకుండా చేస్తానని శపథం చేశారు పవన్. కేవలం విమర్శలే కాకుండా జనసేన అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెప్పుకొచ్చారు పవన్. విద్య, వైద్యం, ఉపాధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇప్పటివరకు జరిగిన సభలతో పోల్చితే మలికిపురంలో భిన్నంగా మాట్లాడారు పవన్ కల్యాణ్. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే, జనసేన అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెప్పే ప్రయత్నం చేశారు. ఉమ్మడి గోదావరి జిల్లాల అభివృద్ధి కోసం రూట్ మ్యాప్ ప్రకటించారు పవన్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..