AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Padma Shri: ఏటికొప్పాక బొమ్మలకు మళ్ళీ ప్రాణం పోసి.. దేశ విదేశాల్లో ప్రాచుర్యం తీసుకొచ్చిన సీవీ రాజుని వరించిన పద్మం..

లక్క బొమ్మలకు ఎలాగైనా మళ్ళీ పూర్వవైభవం తీసుకువచ్చి... వలస పోతున్న కార్మికుల కన్నీటి కష్టాలను తీర్చేందుకు సీవీ రాజు శ్రమించారు. ఢిల్లీ వెళ్లి అధ్యయనాలు చేశారు.1999 లో ఏటికొప్పాకలో హస్తకళా నిలయాన్ని ఏర్పాటుచేసి కళాకారులకు ఆధునిక బొమ్మల తయారీపై శిక్షణ ఇచ్చారు. వారు తయారుచేసిన బొమ్మలకు వారే ధర నిర్ణయించుకునేలా చేశారు. 

Padma Shri: ఏటికొప్పాక బొమ్మలకు మళ్ళీ ప్రాణం పోసి.. దేశ విదేశాల్లో ప్రాచుర్యం తీసుకొచ్చిన సీవీ రాజుని వరించిన పద్మం..
C V Raju
Surya Kala
|

Updated on: Jan 28, 2023 | 8:32 AM

Share

ఆయన హస్త కళలకు రారాజు..! ఆయన చేతిలో లక్క పడితే బొమ్మలు ప్రాణం పోసుకుంటాయి. బొమ్మల్లో జీవం నింపడమే కాదు.. కలను నమ్ముకున్న కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపారు ఆయన. లక్క బొమ్మల తయారీలో ప్రకృతి సహజ రంగులను పరిచయం చేసి ఔరా అనిపించారు. అందుకే దేశంలోనే కాదు విదేశాల్లోనూ ఆయన చేతిలో ప్రాణం పోసుకున్న ఆ బొమ్మలకు అంతటి ప్రాచుర్యం. ఆయన సేవలను గుర్తించిన కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.

పేరు చింతలపాటి వెంకటపతిరాజు అలియాస్ సి వి రాజు అలియాస్ ప్రసాద్ బాబు. స్వస్థలం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామం. ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ఉంది. లక్కబొమ్మల తయారీలో ప్రఖ్యాత కళాకారుడు చింతలపాటి వెంకటపతి రాజు హస్తకళలను బతికించేందుకు చాలా కృషిచేశారు. ఈయన పదోతరగతి పూర్తిచేసే సమయానికి ప్రస్తుత అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాకలో పేరున్న హస్తకళాకారులు కళకు ఆదరణ లేక గ్రామాన్ని విడిచి కూలి పనులకు వలసపోయే వారు. ఇది చూసిన ఆయన.. ఏటికొప్పాక పేరును తిరిగి నిలబెట్టాలని లక్కబొమ్మల పరిశ్రమపై దృష్టిసారించారు.

లక్క బొమ్మలకు ఎలాగైనా మళ్ళీ పూర్వవైభవం తీసుకువచ్చి… వలస పోతున్న కార్మికుల కన్నీటి కష్టాలను తీర్చేందుకు సీవీ రాజు శ్రమించారు. ఢిల్లీ వెళ్లి అధ్యయనాలు చేశారు.1999 లో ఏటికొప్పాకలో హస్తకళా నిలయాన్ని ఏర్పాటుచేసి కళాకారులకు ఆధునిక బొమ్మల తయారీపై శిక్షణ ఇచ్చారు. వారు తయారుచేసిన బొమ్మలకు వారే ధర నిర్ణయించుకునేలా చేశారు.

ఇవి కూడా చదవండి

అంతటితో ఆగకుండా… లక్క బొమ్మలకు ప్రాచుర్యం కల్పించేలా ప్రత్యేక కృషి చేశారు సి వి రాజు. బొమ్మలను విదేశాలకు పంపితే గిట్టుబాటు ధర లభించడంతో పాటు గ్రామం పేరు ప్రపంచస్థాయికి వెళ్తుందని ఆశించారు. కానీ బొమ్మల్లో వాడిన రంగుల్లో రసాయనాలు ఉన్నాయని విదేశీయులు వీటిని తిరస్కరించారు. దీంతో ఆయన ప్రకృతిసిద్ధమైన రంగులు తయారుచేస్తే ఈ ఇబ్బంది ఉండదని భావిం చారు. పసుపు, ఇండిగో పిక్కలు, జాప్రా, కర క్కాయి తదితరాలతో ప్రకృతిసిద్ధమైన రంగుల తయారీకి శ్రీకారం చుట్టారు. దీంతో ఇక్కడి బొమ్మలు విదేశాలకు ఎగుమతయ్యాయి. ఇలా అమెరికా, నెదర్లాండ్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాలకు లక్క బొమ్మలు ఎగుమత అయ్యేలా ఏటికొప్పాక బొమ్మలకు ప్రాచుర్యం కల్పించారు.

విదేశాల నుంచి ఆర్డర్లు రావడంతో కళాకారుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. బొమ్మల తయారు చేసే కలను విడిచి పెట్టే క్రమంలో చాలామంది తిరిగి ఈ బొమ్మను తయారు చేసేందుకు ముందుకు వచ్చారు. ఆన్లైన్ అమ్మకాలు కూడా పెరిగాయి. ప్రముఖ వాచ్ తయారీ సంస్థ టైటాన్ కూడా ఆర్డర్లు ఇచ్చింది. సివి రాజు దగ్గర కలను నేర్చుకున్న కళాకారుడు చిన్నయ్యచారికి జాతీయ స్థాయి అవార్డు కూడా లభించింది.

హస్తకళలను బతికించడమే కాకుండా… సహజ సిద్ధ రంగులద్ది విదేశాలకు పరిచయం చేసిన సీవీ రాజుకు ఎన్నో అవార్డులు వరించాయి. ఈయన సేవలను గుర్తించిన ప్రభుత్వం 2002లో జాతీయస్థాయి అవార్డును ప్రకటించింది. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుంచి ఈ అవార్డును అందుకున్నారు సీవీరాజు. క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ నుంచి కూడా అవార్డులు అందుకున్నారు. ఇప్పుడు పద్మశ్రీ అవార్డుతో సీవీ రాజును కేంద్రం సత్కరించడం ఉంది. తాజాగా ప్రకటించిన జాబితాలో సివి రాజు పేరును చేర్చి కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. దీంతో 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఏటికొప్పాక హస్తకళలకు లభించిన గౌరవంగా అభివర్ణించారు సివి రాజు. లక్క బొమ్మల తయారీకి వినియోగించి అంకుడు చెట్లను పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

పద్మశ్రీ అవార్డుకు సీవీ రాజు ఎంపికవడంతో,. నూతనంగా ఏర్పాటైన అనకాపల్లి జిల్లాలతో పాటు ఏటి కొప్పాకలో పండుగ వాతావరణం నెలకొంది. పద్మశ్రీ అవార్డు కేంద్రం ప్రకటించడంతో సీవీరాజును సత్కరించింది అనకాపల్లి జిల్లా యంత్రాంగం. రిపబ్లిక్ డే సందర్భంగా సివి రాజును ప్రత్యేకంగా సన్మానించింది.

Reporter: Khaja

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్