Andhra Pradesh: పగిలిన బండరాయిని తొలగించని అధికారులు.. రోడెక్కిన కాలనీ వాసులు
కర్నూలు జిల్లా గోనెగండ్లలో ఎస్సీ కాలనీలో స్థానికులు మళ్లీ ఆందోళనకు దిగారు. రెండు వారాల క్రితం ఎండవేడిమికి కొండరాయి పగిలిపోయింది. అయితే 13 రోజులైనా కొండరాయిని తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కాలనీవాసులు ఆందోళనకు దిగారు. కర్నూలు- బళ్లారి రహదారిపై..
కర్నూలు జిల్లా గోనెగండ్లలో ఎస్సీ కాలనీలో స్థానికులు మళ్లీ ఆందోళనకు దిగారు. రెండు వారాల క్రితం ఎండవేడిమికి కొండరాయి పగిలిపోయింది. అయితే 13 రోజులైనా కొండరాయిని తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కాలనీవాసులు ఆందోళనకు దిగారు. కర్నూలు- బళ్లారి రహదారిపై ధర్నా చేపట్టారు. కొండరాయిని తొలగించని అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇళ్ల పక్కనే ఉన్న కొండపై బండరాయి ఎండవేడిమికి నిట్టనిలువునా చీలిపోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కొండను తొలగించాలని డిమాండ్ చేశారు. అధికారులు హామీ ఇచ్చి ఆ తర్వాత పత్తా లేకుండా పోయారన్నారు. కొండను పూర్తిగా తొలగించకపోతే కుటుంబసభ్యులతో కలిసి పెద్దయెత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఎస్సీ కాలనీ వాసుల ఆందోళనపై స్థానిక అధికారులు స్పందించారు. కొండను తొలగించేందుకు ఎస్టిమేషన్ సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపామన్నారు. వారి నుంచి ఆదేశాలు రాగానే కొండను తొలగించే పనులు చేపడతామని హామీ ఇచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి