Badvel By-Election: బద్వేలు ఉప ఎన్నిక టీడీపీ అభ్యర్థి అధికారికంగా ఖరారు.. ఎవరంటే..?
కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక టీడీపీ అభ్యర్థిగా ఓబుళాపురం రాజశేఖర్ పేరు ఖరారైంది. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు
Badvel By-Poll: కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక టీడీపీ అభ్యర్థిగా ఓబుళాపురం రాజశేఖర్ పేరు ఖరారైంది. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీంతో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కొంచెంసేపటి క్రితం అధికారిక ప్రకటన విడుదల చేశారు.
నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బద్వేలు నియోజకవర్గం ఉప ఎన్నికలపై చర్చించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరు అనే విషయంపై బద్వేలు, జిల్లా నాయకుల అభిప్రాయాలు తీసుకున్నారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాత బద్వేలు ఉప ఎన్నికల్లో తప్పక పోటీ చేద్దామన్న నిర్ణయానికి పార్టీ అధినేత వచ్చారు.
అభ్యర్థిగా డాక్టరు రాజశేఖర్ బరిలో ఉంటారని చంద్రబాబు పేర్కొనడంతో జిల్లా నాయకులు సమష్టిగా మద్దతు తెలిపారు. దీంతో నేడు అధికారికంగా బద్వేలు టీడీపీ అభ్యర్థిని ప్రకటించారు. ఈ సందర్భంగా కడప జిల్లా పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. జగన ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందన్న బాబు.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విదానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలి అని పిలుపునిచ్చారు.
రానున్న బద్వేలు ఉప ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు చంద్రబాబు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కడప పార్లమెంట్ నాయకులతో అధినేత చంద్రబాబు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్ చార్జిలు, ముఖ్య నాయకులతో చంద్రబాబు విడివిడిగా చర్చించారు.
Read also:Taliban New government : పంజ్‌షేర్ మా వశమైపోయింది.. ఆఫ్ఘన్ మొత్తం తమదేనని ప్రకటించుకున్న తాలిబన్లు