AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూటమి ఖాతాలో మరో మునిసిపాలిటీ.. బొబ్బిలి యుద్ధంలో నెగ్గిన కూటమి

విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు కూటమి నేతలు. అందుకోసం పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గించుకున్నారు. ఎలాగైనా మున్సిపల్ పీఠం దక్కించుకోవాలని కూటమి నేతలు, తమ పీఠాన్ని పదిలపరచుకోవాలని వైసీపీ నేతలు ఎవరికి వారే పక్కా స్కెచ్ తో క్యాంప్ పొలిటికల్స్‌కి తెరలేపినా చివరికి కూటమి నేతలే నెగ్గారు.

కూటమి ఖాతాలో మరో మునిసిపాలిటీ.. బొబ్బిలి యుద్ధంలో నెగ్గిన కూటమి
Bobbili Municipality
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Apr 29, 2025 | 3:20 PM

Share

విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు కూటమి నేతలు. అందుకోసం పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గించుకున్నారు. ఎలాగైనా మున్సిపల్ పీఠం దక్కించుకోవాలని కూటమి నేతలు, తమ పీఠాన్ని పదిలపరచుకోవాలని వైసీపీ నేతలు ఎవరికి వారే పక్కా స్కెచ్ తో క్యాంప్ పొలిటికల్స్‌కి తెరలేపినా చివరికి కూటమి నేతలే నెగ్గారు. ఈ అంశంతో విజయనగరం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా రసవత్తరంగా మారాయి.

నాలుగేళ్ల క్రితం వైసీపీ దక్కించుకున్న బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ పదవిని ఇప్పుడు అధికార కూటమి దక్కించుకునేందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకుంది. బొబ్బిలి మున్సిపాలిటీపై ఎలాగైనా తమ జెండా ఎగురవేయాలని కూటమి చేసిన ప్రయత్నం సక్సెస్ పుల్ గా నెరవేరింది. అవిశ్వాసానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ ను సొంతం చేసుకునేందుకు ముందుగానే వైసీపీ కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకుంది. బొబ్బిలి మున్సిపాలిటీలో మొత్తం 30 మంది కౌన్సిలర్లు ఉండగా, అవిశ్వాస తీర్మానంలో చైర్మన్ కు వ్యతిరేకంగా 20 మంది ఓటేస్తే వైసీపీ చైర్మన్ పదవి కోల్పోయే అవకాశం ఉంది. అనంతరం 16 మంది చేతులెత్తి కొత్త చైర్మన్ ను ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది.

బొబ్బిలి మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 31 వార్డులుండగా, వాటిలో పది వార్డులను టీడీపీ, 20 వైసీపీ, ఒక వార్డు ఇండిపెండెంట్ కైవసం చేసుకున్నారు. అయితే ఆ తరువాత ఒక వైసీపీ సభ్యుడు రాజీనామా చేయడంతో బొబ్బిలిలో మొత్తం 30 మంది కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఇండిపెండెంట్ తోపాటు మరో 9 మంది వైసీపీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో టీడీపీ బలం 20కి చేరింది. ఎమ్మెల్యే బేబీనాయన ఎక్స్ అఫిషియో మెంబర్ గా ఓటు హక్కు ఉండటంతో అవిశ్వాసం తీర్మానం నెగ్గటానికి ఎలాంటి ఢోకా లేదు. అవిశ్వాసానికి కావలసిన 20 మంది కౌన్సిలర్లు కూటమికి ఉండటంతో ఓటింగ్ సమయానికి వారిలో ఏ ఒక్కరు చేజారిపోకుండా క్యాంప్ పాలిటిక్స్ కి తెరలేపారు కూటమి నేతలు.

ఈ నేపథ్యంలోనే వైసీపీ నుండి మద్దతు ఇస్తున్న తొమ్మిది మంది, ఒక ఇండిపెండెంట్ తోపాటు టీడీపీకి చెందిన10 మంది కౌన్సిలర్లను క్యాంప్‌లో ఉంచి నేరుగా ప్రత్యేక బస్సులో బొబ్బిలి మున్సిపల్ సమావేశ మందిరంకి తీసుకువచ్చారు. అయితే ఈ అవిశ్వాస తీర్మానంకు వైసీపీకి చెందిన మిగిలిన పది మంది కౌన్సిలర్లు కూడా హాజరయ్యారు. ఇక మునిసిపల్ సమావేశం ప్రారంభమైన తరువాత అవిశ్వాస తీర్మానం ప్రారంభించారు ఎన్నికల అధికారులు. అలా పెట్టిన అవిశ్వాసంలో కూటమి సభ్యులు 20 మందితో పాటు ఎక్స్ అఫిషియో సభ్యుడు ఎమ్మెల్యే బేబీనాయన కూడా అవిశ్వాస తీర్మానంకి అనుకూలంగా ఓటేయడంతో 21 ఓట్లతో అవిశ్వాసం నెగ్గి ప్రస్తుత చైర్మన్ సావు మురళీ కృష్ణ తన పదవిని కోల్పోయారు. ఆ తరువాత కొత్తగా ఎన్నుకోబోయే నూతన చైర్మన్ ఎవరు అన్న చర్చ కూడా జోరుగా సాగుతుంది. ఇక బొబ్బిలి మున్సిపాలిటీకి టీడీపీ సభ్యుడిని నూతన చైర్మన్ గా ఎన్నిక కావడం లాంఛనమే అయ్యింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

'ఘోరమైన పాపం చేశావ్'..టాలీవుడ్ హీరోయిన్‌పై ముస్లింల తీవ్ర ఆగ్రహం
'ఘోరమైన పాపం చేశావ్'..టాలీవుడ్ హీరోయిన్‌పై ముస్లింల తీవ్ర ఆగ్రహం
గూగుల్‌లో పనిచేస్తున్న యువతి..తల్లిదండ్రులకు తన ఆఫీస్‌ చూపించింది
గూగుల్‌లో పనిచేస్తున్న యువతి..తల్లిదండ్రులకు తన ఆఫీస్‌ చూపించింది
ట్రైన్ టికెట్లపై 6 శాతం భారీ డిస్కౌంట్.. రైల్వేశాఖ బంపర్ ఆఫర్
ట్రైన్ టికెట్లపై 6 శాతం భారీ డిస్కౌంట్.. రైల్వేశాఖ బంపర్ ఆఫర్
ఎవరో తీసుకున్న లోన్‌ మీరు కట్టాల్సి రావొచ్చు!
ఎవరో తీసుకున్న లోన్‌ మీరు కట్టాల్సి రావొచ్చు!
షాకింగ్..2026లో రిటైర్మెంట్ ప్రకటించనున్న ఐదుగురు ప్లేయర్లు
షాకింగ్..2026లో రిటైర్మెంట్ ప్రకటించనున్న ఐదుగురు ప్లేయర్లు
అబ్బ రోడ్లే రోడ్లు.. కేంద్ర కేబినెట్‌ సంచలన నిర్ణయాలు..
అబ్బ రోడ్లే రోడ్లు.. కేంద్ర కేబినెట్‌ సంచలన నిర్ణయాలు..
న్యూజిలాండ్ సిరీస్ ముందు రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం
న్యూజిలాండ్ సిరీస్ ముందు రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం
Viral video: చీర, హైహీల్స్‌లో హృతిక్ స్టెప్పులతో అదరగొట్టింది!
Viral video: చీర, హైహీల్స్‌లో హృతిక్ స్టెప్పులతో అదరగొట్టింది!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మార్పులు.. ప్రయాణికులకు అలర్ట్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మార్పులు.. ప్రయాణికులకు అలర్ట్
కూతురిని పరిచయం చేసిన టబు.. ఫ్యాన్స్ షాక్..
కూతురిని పరిచయం చేసిన టబు.. ఫ్యాన్స్ షాక్..