AP Night Curfew: ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలులో మార్పు.. ఎప్పటినుంచంటే.?

కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించిన...

AP Night Curfew: ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలులో మార్పు.. ఎప్పటినుంచంటే.?
Night Curfew
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 11, 2022 | 5:22 PM

కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ముందుగా ఇవాళ్టి నుంచి ఈ కర్ఫ్యూను అమలులోకి తీసుకురావాలని యోచించిన సర్కార్.. తాజాగా కీలక మార్పు చేసింది. సంక్రాంతి పండుగ తర్వాత నుంచి నైట్ కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. పండుగ నేపధ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ నెల 18వ తేదీ నుంచి నెలాఖరు వరకు రాష్ట్రమంతా నైట్ కర్ఫ్యూను అమలు చేయాలని ఉత్తర్వుల్లో జారీ చేసింది. కాగా, రాత్రి 11 గంటల నుంచి మర్నాడు ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉంటుంది. నిత్యావసర వస్తువులు, వైద్య చికిత్స వంటి అత్యవసర సర్వీసులకు మినహాయింపునిచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో 200 మందికి, ఇండోర్ 100 మందికి మాత్రమే అనుమతినిచ్చింది. సంక్రాంతి పండగను దృష్టిలో ఉంచుకుని అంతరాష్ట్ర రవాణాకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.

ఇక సినిమా థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీకి అనుమతినిచ్చింది. ప్రజా రవాణాలో ప్రయాణికులు, సిబ్బందికి మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించింది. షాపింగ్ మాల్స్, దుకాణాల్లోకి మాస్క్ తప్పనిసరి అని.. రూల్స్ ఉల్లంఘిస్తే షాప్ నిర్వాహకులకు గరిష్టంగా రూ. 25,000 జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది.

Also Read:

ఈ ఫోటోలో పాము దాగుంది.. ఈజీగా కనిపెట్టచ్చండోయ్‌.. కష్టం కాదు.!

ఈ పాము చాలా డేంజర్.. దీని వేట మాములుగా ఉండదు.. దొరికితే జ్యూస్‌లా చేసి తాగేస్తుంది!

 ఒకరిద్దరు కాదు.. ఏకంగా 1000 మంది జంటల వికృత రాసలీలలు.. భార్యలను మార్చుకుంటూ..