AP Rains: ఏపీ ప్రజలకు వాతావరణశాఖ అలెర్ట్.. మూడు రోజులపాటు వర్షాలు..
Andhra Pradesh Rains: నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని
Andhra Pradesh Rains: నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు కూడా సంభవించే అవకాశముందని హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్లు ఎత్తు వరకు వ్యాపించిఉన్నట్లు తెలిపింది. దీనికారణంగా ఆంధ్రప్రదేశ్‌లో దక్షిణ, ఆగ్నేయ గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఈ మేరకు వాతావరణశాఖ మంగళవారం ప్రకటన విడుదల చేసింది.
ఉత్తర కోస్తా ఆంధ్ర: ఈరోజు తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈ రోజు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది. రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుముల తో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ: ఈ రోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది.
‘Tek Fog’: దేశ రాజకీయాలలో మరోసారి చిచ్చు రేపుతున్న టెక్ ఫాగ్ యాప్ వ్యవహారం?