Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Precautionary Dose: ఫ్రంట్ లైన్ వర్కర్లు ప్రికాషనరీ డోస్ తీసుకోవాలి.. బూస్టర్ డోస్ వేసుకున్న ఆరోగ్య శాఖ కమిషనర్‌..

ఫ్రంట్ లైన్ వర్కర్లు ప్రికాషనరీ డోస్(బూస్టర్ డోస్) తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్. ముఖ్యంగా హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లుతోపాటు..

Precautionary Dose: ఫ్రంట్ లైన్ వర్కర్లు ప్రికాషనరీ డోస్ తీసుకోవాలి.. బూస్టర్ డోస్ వేసుకున్న ఆరోగ్య శాఖ కమిషనర్‌..
Precautionary Dose
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 11, 2022 | 4:28 PM

ఫ్రంట్ లైన్ వర్కర్లు ప్రికాషనరీ డోస్(బూస్టర్ డోస్) తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్. ముఖ్యంగా హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లుతోపాటు అరవయ్యేళ్లు దాటిన వారు తప్పనిసరిగా ప్రికాషనరీ డోస్ వేసుకోవాలన్నారు. ఇవాళ మంగళగిరిలోని ఎపీఐఐసీ బిల్డింగ్‌లో ప్రికాషనరీ డోస్ వేసుకున్న కమిషనర్. ప్రాణాలకు తెగించి కోవిడ్‌తో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పోరాడుతున్నారని ప్రశంసించారు.

వ్యాక్సినేషన్ ఏపీలో టాప్ నిలిచేందుకు సిబ్బంది అంకిత భావంతో పనిచేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చొరవతో కొవిడ్ నియంత్రణలో దేశానికే ఏపీ ఆదర్శంగా నిలిచిందన్నారు. వ్యాక్సినేషన్‌ విజయవంతమయ్యేందుకు జిల్లాల కలెక్టర్లు, జేసీలు, వైద్యాధికారులు చేస్తున్న కృషి అభినందనీయన్నారు. ఎఎన్ఎంలు‌ , ఆశా వర్కర్లు నిరంతరం శ్రమిస్తూ విజయవంతం చేస్తున్నారని అన్నారు.

మరింత అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కొవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్ లో దేశంలోనే ఏపీ ముందుందన్నారు వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్ .

ఏపీలో కరోనా నిబంధనలు మరింత కఠినం..

ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకీ కరోనా కేసులు భారీ పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం అలెర్ట్ అయింది. కోవిడ్ వ్యాప్తి నివారణ చర్యలు కఠిన తరం చేసింది. అంతేకాదు ఏపీలో నైట్ కర్ఫ్యూ ని విధించింది. తాజాగా నైట్ కర్ఫ్యూ నిబంధనలు విడుదల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈనెలాఖరు వరకు రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నిత్యావసర వస్తువులు, వైద్య చికిత్స వంటి అత్యవసర సర్వీసులకు మినహాయింపునిచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో 200 మందికి, ఇండోర్ 100 మందికి మాత్రమే అనుమతినిచ్చింది. అయితే సంక్రాంతి పండగ ను దృష్టిలో ఉంచుకుని అంతరాష్ట్ర రవాణాకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.

ఇవి కూడా చదవండి: Paritala Sunita: నా బిడ్డను ధర్మవరం ప్రజల చేతుల్లో పెడుతున్నా.. కీలక ప్రకటన చేసిన పరిటాల సునీత..

Ration Card: మీకు తెలుసా ఈ విషయం.. రేషన్ కార్డులో మీ పేరు ఉందో.. లేదో.. ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు..