AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIDAP Guntur Jobs: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. నెలకు రూ.2,15,900ల జీతం

కేంద్ర ప్రభుత్వ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిధిలోని గుంటూరు-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/డిప్యూటేషన్/షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 24 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి..

NIDAP Guntur Jobs: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. నెలకు రూ.2,15,900ల జీతం
NIDAP Guntur
Srilakshmi C
|

Updated on: Mar 27, 2023 | 1:55 PM

Share

కేంద్ర ప్రభుత్వ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిధిలోని గుంటూరు-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/డిప్యూటేషన్/షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 24 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనిర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 నుంచి 56 యేళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా నోటిఫికేషన్‌ విడుదలైన 45 రోజుల్లోపు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌ మార్చి 25, 2022వ తేదీన విడుదలైంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.25,000ల నుంచి రూ.2,15,900ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు..

  • ప్రిన్సిపల్ డిజైనర్ పోస్టులు: 2
  • సీనియర్ డిజైనర్ పోస్టులు: 3
  • ఫ్యాకల్టీ పోస్టులు: 4
  • హెడ్ లైబ్రేరియన్ పోస్టులు: 1
  • సీనియర్ ఇంజినీర్ (ల్యాండ్, బిల్డింగ్ అండ్‌ మెయింటెనెన్స్) పోస్టులు: 1
  • అసోసియేట్ సీనియర్ టెక్నికల్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు: 2
  • అసోసియేట్ సీనియర్ డిజైన్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు: 2
  • టెక్నికల్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు: 1
  • డిజైన్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు: 2
  • టెక్నికల్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు: 1
  • అసిస్టెంట్ ఇంజినీర్ (ఐటీ) పోస్టులు: 1
  • సూపర్‌వైజర్ (ఎలక్ట్రికల్) పోస్టులు: 1
  • టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు: 2
  • అసిస్టెంట్ పోస్టులు: 1

అడ్రస్..

The Chief Administrative Officer National Institute of Design Andhra Pradesh Transit Campus: EEE Building, Acharya Nagarjuna University, Nagarjuna Nagar, Namburu, Guntur – 522 510.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.