AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: రోడ్డు మీదే రౌడీలకు, పోకిరిలకు స్పెషల్ ట్రీట్మెంట్.. వీడియో చూస్తే గజగజ వణకాల్సిందే..

రాత్రి పది దాటితే రోడ్లపై రౌడీల హల్చల్... ఏమని ప్రశ్నిస్తే కత్తులతో దాడులకు తెగబడుతున్న రౌడీ మూక.. ఇటీవల వరుస హత్యలు.. దాడుల నేపథ్యంలో పోలీసు అధికారులు స్పెషల్ ట్రీట్మెంట్ మొదలు పెట్టారు.. రాత్రి పది దాటితే రోడ్లపై చేపడుతున్న చర్యలు చూస్తే గజగజ వణకాల్సిందే..

Andhra: రోడ్డు మీదే రౌడీలకు, పోకిరిలకు స్పెషల్ ట్రీట్మెంట్.. వీడియో చూస్తే గజగజ వణకాల్సిందే..
Nellore
Ch Murali
| Edited By: |

Updated on: Dec 09, 2025 | 1:17 PM

Share

నెల్లూరు నగరంలో ఇటీవల రౌడీలు రెచ్చిపోతున్నారు.. పట్ట పగలే దాడులు, హత్యలు చేస్తూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు.. ఇటీవల కాలంలో వరుస ఘటనలతో నెల్లూరు నగరం ఉలిక్కి పడింది.. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రౌడీల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ వెరైటీ పనిష్మెంట్ ఇస్తున్నారు.. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ రెండు నియోజకవర్గాలు ఉన్నాయి.. ఇటీవల కాలంలో గంజాయి బ్యాచ్‌లు రెచ్చిపోతున్నాయి. నగర పరిధిలో గడిచిన ఏడాదిగా వరుస హత్యలు జరిగాయి.. పట్టపగలే నగరం నడబొడ్డున కత్తులతో నరికి చంపిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇటు అయ్యప్ప గుడి సెంటర్ నుంచి అటు బొడిగాని తోట వరకు రౌడీ బ్యాచ్ లు పేట్రేగిపోతున్నాయి. నగరంలో పలు చోట్ల డెన్ లు ఏర్పాటు చేసుకుని గంజాయి అమ్మకాలకు పాల్పడుతున్నారు.. ఇటీవల ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో గంజాయి విక్రయించే ముఠాను పోలీసులు వెంబడించగా వారిపైనే దాడులకు పాల్పడ్డారు.. దీంతో పోలీసులు కాల్పులు జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.. ఇటీవల కాలంలో దాదాపు 20 హత్యలు జరిగాయి.. ఇటీవల రౌడీ షీటర్ శ్రీకాంత్ జైల్లో ఉంటూ అతని ప్రియురాలు నిదిగుంట అరుణ చే సెటిల్మెంట్లు చేయిస్తున్న విషయం వెలుగు చూడటంతో శ్రీకాంత్ పెరోల్ రద్దు చేయడంతో పాటు అరుణ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

తాజాగా గంజాయి విక్రయాలు జరుపుతున్నారని కామాక్షి పై స్థానిక సిపిఎం నేత పెంచలయ్య అడ్డు తగులుతున్నాడని.. అతనిపై పది మందికి పైగా కత్తులతో నరికి చంపారు.. ఇక రెండు రోజుల క్రితం నెల్లూరు సిటీలోని బోసు బొమ్మ సెంటర్లో బస్సు డ్రైవర్ కండక్టర్ పై ముగ్గురు యువకులు దాడి చేసి కత్తులతో తీవ్రంగా గాయపరిచారు.. ఘటనతో నెల్లూరు నగరం మరొకసారి ఉలిక్కిపడింది.. దీంతో నెల్లూరు నగరంలో జరుగుతున్న వరుస హత్యలు.. ఇక్కడ శాంతి భద్రతల అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది.. దీంతో నగరంలో ఉన్న రౌడీ షీటర్లను పిలిపించి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.. అంతేకాకుండా రౌడీలతో నగరంలో ప్రదర్శన నిర్వహించారు.

వీడియో చూడండి..

ఇటీవల జరుగుతున్న హత్యలు, దాడుల నేపథ్యంలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా తాజాగా ప్రదర్శన నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు చేస్తూ.. ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు.. రాత్రి వేళల్లో 10 గంటల దాటిన తర్వాత అల్లరిముకలు రోడ్డుపై కనబడితే పోలీసు బలగాలు మోహరించి వారికి పోలీస్ స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు.. గత రెండు రోజులుగా రాత్రి వేళల్లో అల్లరి మూకలకు ఇస్తున్న ట్రీట్మెంట్ తో .. నేరం చెయ్యాలన్న ఆలోచన వస్తే ఎలాంటి చర్యలు ఉంటాయో అనే రీతిలో పోలీసులు గట్టి వార్నింగ్ ఇస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..