Andhra: పురాతన ఆలయం దగ్గర ఏదో మెరుస్తూ కనిపించిన శిలారాయి.. దాని మీదున్నవి పరిశీలించగా..
నల్లమల అడవుల్లో పది, పదకొండో శతాబ్ద కాలంలో నిర్మించిన ఆలయాలు, వేసిన శాసనాలు కాకతీయుల కాలంలో సామాజిక, మతపరమైన అంశాలను అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన ఆధారాలుగా ఉంటున్నాయి. ఇటీవల కాలంలో పలు శాసనాలు వెలుగులోకి వస్తున్నాయి. వీటి ద్వారా అప్పటి సామాజిక అంశాలు, మతపరమైన విశేషాలు ఈ శాసనాల ద్వారా తెలుసుకోవడంలో చారిత్రక పరిశోధకులు ఆసక్తి చూపిస్తున్నారు.

నల్లమల అడవుల్లో పది, పదకొండో శతాబ్ద కాలంలో నిర్మించిన ఆలయాలు, వేసిన శాసనాలు కాకతీయుల కాలంలో సామాజిక, మతపరమైన అంశాలను అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన ఆధారాలుగా ఉంటున్నాయి. ఇటీవల కాలంలో పలు శాసనాలు వెలుగులోకి వస్తున్నాయి. వీటి ద్వారా అప్పటి సామాజిక అంశాలు, మతపరమైన విశేషాలు ఈ శాసనాల ద్వారా తెలుసుకోవడంలో చారిత్రక పరిశోధకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి పరిశోధనల ఫలితంగా నల్లమల అటవీప్రాంతంలో కాటమరాజు ఆలయం దగ్గర మరో శాసనం బయటపడింది. పదకొండో శతాబ్దంలో కాయస్త వంశానికి చెందిన కాకతీయ గణపతిదేవుడు దగ్గర సామంత రాజుగా పనిచేసిన గంగయసాహిని అనే రాజు ఈ ప్రాంతంలో శ్రీరంగదేవర స్వామికి సేవలు చేసేందుకు మారదూరు అనే గ్రామాన్ని బహుమతిగా ఇచ్చినట్లు శాసనాల్లో బయటపడింది.
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గుండంచర్ల సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో మరో చారిత్రక శాసనం వెలుగు చూసింది. కాటమరాజు గంగాభవానీ ఆలయం దగ్గర 1180 నాటి పురాతన శాసనాలను తాజాగా గుర్తించారు. అప్పట్లో వాడుకలో ఉన్న లిపితో రాయబడి ఉన్న శాసనంలో పలు విశేషాలను చారిత్రక పరిశోధకులు మునిరత్నంరెడ్డి విశ్లేషించారు. ఈ శాసనంలో 1258 కాలాన్ని తెలియజేస్తున్న వివరాలు ఉన్నాయి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ మునిరత్నంరెడ్డి చేసిన విశ్లేషణలో 11వ శతాబ్ధంలో మహారాష్ట్ర ప్రాంతం నుంచి వచ్చి, తురిమెళ్ల కేంద్రంగా రాజధాని చేసుకొని ఏరువనాడుగా పిలువబడిన ఈ ప్రాంతాన్ని కాయస్త వంశానికి చెందిన కాకతీయ గణపతిదేవుడు పరిపాలించాడని తేలింది.
ఆయన దగ్గర సామంత రాజుగా పనిచేసిన గంగయసాహిని అనే రాజు ఈ ప్రాంతంలో శ్రీరంగదేవర స్వామికి సేవలు చేసేందుకు మారదూరు అనే గ్రామాన్ని బహుమతిగా ఇచ్చినట్లు శాసనాల్లో ఉంది. ఈ ప్రాంతంలో కొన్ని భూములను సైతం వారి సేవలకు కేటాయించినట్లు శాసనాల్లో పేర్కొన్నారు. మారదూరు కాలక్రమేనా అర్థవీడు మండలంలోని మాగుటూరుగా పిలువబడుతున్న ప్రాంతమే కావడం విశేషం. ఈ శాసనాల్లో ఉన్న వివరాలను ఆర్కియాలజికల్ డైరెక్టర్ కూడా ధృవీకరించినట్టు చారిత్రక పరిశోధకులు తురిమెల్ల శ్రీనివాస ప్రసాద్ తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




