CSIR UGC NET 2025 Exam: మరో వారంలో సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ రాత పరీక్ష.. సిటీ ఇంటిమేషన్ స్లిప్ లింక్ ఇదే
CSIR UGC NET 2025 City Intimation Slips: జాయింట్ సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ డిసెంబర్ 2025 సెషన్ పరీక్షకు త్వరలోనే జరగనుంది. ఈ క్రమంలో ఈ పరీక్షకు సంబంధించి సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను నేషనల్ టెస్టింగ్ ఏజేన్సీ (ఎన్టీయే) విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి..

హైదరాబాద్, డిసెంబర్ 9: జాయింట్ సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ డిసెంబర్ 2025 సెషన్ పరీక్షకు త్వరలోనే జరగనుంది. ఈ క్రమంలో ఈ పరీక్షకు సంబంధించి సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను నేషనల్ టెస్టింగ్ ఏజేన్సీ (ఎన్టీయే) విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి తమ పరీక్ష నగరానికి సంబంధించిన ప్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారం సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ పరీక్ష డిసెంబర్ 18న ఆన్‌లైన్ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. ఈ మేరకు ఎన్టీయే తన ప్రకటనలో పేర్కొంది.
డిసెంబర్ 18వ తేదీన రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం లైఫ్ షిఫ్టు 1 సెషన్‌లో సైన్సెస్, ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్ పేపర్లకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఇక మధ్యాహ్నం షిఫ్టు 2లో కెమికల్ సైన్సెస్, మ్యాథమేటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ పేపర్లకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇక పరీక్షకు సరిగ్గా 4 రోజుల ముందు వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను విడుదల చేయనున్నారు.
కాగా సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ 2025 పరీక్షలో అర్హత సాధించిన వారికి సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించే జేఆర్‌ఎఫ్‌తోపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు, పీహెచ్‌డీ ప్రవేశాలకు అవకాశం ఇస్తుంది. జేఆర్‌ఎఫ్ అర్హత పొందిన వారికి సీఎస్‌ఐఆర్ పరిధిలోని రిసెర్చ్ సెంటర్లలో, యూనివర్సిటీల్లో పీహెచ్‌డీలో ప్రవేశాలకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు ఈ కింది అధికారిక వెబ్‌సైట్ లింక్ సంప్రదించవచ్చు.
సీఎస్‌ఐఆర్ యూజీసీ 2025 నెట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్పుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




