10th Public Exams Time Table 2026: పదో తరగతి పబ్లిక్ పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. ఇంతకీ ఎప్పట్నుంచంటే?
Telangana 10th Class Public Exam 2025 dates: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి 16 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించాలని స్కూల్ ఎడ్యూకేషన్ విభాగం భావిస్తోంది. అందుకోసం పరీక్షల తేదీల ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు పంపించారు. ఇంటర్ పరీక్షలు ముగిసిన వెంటనే..

హైదరాబాద్, డిసెంబర్ 8: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి 16 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించాలని స్కూల్ ఎడ్యూకేషన్ విభాగం భావిస్తోంది. అందుకోసం పరీక్షల తేదీల ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు పంపించారు. ఇంటర్ పరీక్షలు ముగిసిన వెంటనే టెన్త్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యేలా డేట్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారుల ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేయడమే ఆలస్యం అధికారికంగా షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ప్రస్తుత్తం సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ బిజీలో ఉండటంతో వారం పదిరోజుల్లో పదో తరగతి పరీక్షల తేదీలను వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.
రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 13 వరకు జరగనున్నాయి. ఆ తర్వాత మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావించారు. అంతేకాకుండా ఈ ఏడాది ఒక్కో ఎగ్జామ్ కు మధ్య ఒకరోజు గ్యాప్ ఇచ్చేలా ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. స్టూడెంట్స్ పై ఒత్తిడి లేకుండా ఈ గ్యాప్ ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఒకటి రెండు రోజుల్లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేస్తారు. మరోవైపు టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహణకు ఏర్పాట్లు చకాచకా చేసేస్తున్నారు.
ఫీజు చెల్లింపు, విద్యార్థుల ఎన్ రోల్మెంట్ వివరాల్లో మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. హాల్ టికెట్ల జారీ, విద్యార్థులపై ఒత్తిడి లేకుండా సమయానికి సిలబస్ పూర్తి చేయడం, పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తామని అంటున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




