AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Politics: ఆలూరు లేదా పత్తికొండ.. ఏదైనా పర్వాలేదు.. గెలిచి జగనన్నకు కానుకగా ఇస్తా..

Himavarsha Reddy: యువతి యువకులు అమెరికా వెళ్లాలని కలలు కంటున్నారు వాటిని సహకారం చేసుకుంటున్నారు. కానీ అమెరికాలో మంచి పొజిషన్ హోదా ఉద్యోగం వదిలిపెట్టి ఆంధ్ర కి ఆ యువతి ఎందుకు వచ్చింది? అమెరికాకు తిరిగి వెళ్ళనని ఎందుకు అంటుంది?

AP Politics: ఆలూరు లేదా పత్తికొండ.. ఏదైనా పర్వాలేదు.. గెలిచి జగనన్నకు కానుకగా ఇస్తా..
Hima Varsha Reddy
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Jul 18, 2023 | 8:18 PM

Share

కర్నూలు జిల్లా, జూలై 18: ఏడాది వయసులో ఉండగా తండ్రి ఫ్యాక్షన్ కక్షల కు బలయ్యాడు. తల్లిదండ్రులు ఇద్దరు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. తండ్రి ఫ్యాక్షన్ వర్గక్షల కారణంగా హాత్యకు గురయ్యాడు. తల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. దంపతులకు ఒకే కూతురు. అమెరికాలో ఎమ్మెస్ చేసింది.. మంచి ఉద్యోగం చేస్తుండగా తల్లి మృతి వార్త పిడుగుపాటులా మారింది. ఈ సందర్భంగా ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుంది. తల్లిదండ్రుల బాటలోనే నడవాలని రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇంతకు ఎవరా యువతి ? ఏంటిది ఆ కథ… తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే…

చూడముచ్చటగా ఉన్న ఈ యువతీ పేరు హిమ వర్షా రెడ్డి. వయసు 27 అమెరికాలో ఎమ్మెస్ చేసి అక్కడే ఉద్యోగం చేస్తోంది భర్త చంద్రశేఖర్ రెడ్డి సాఫ్ట్వేర్ కంపెనీ అమెరికాలోనే నడుపుతున్నాడు. వర్షా రెడ్డి ఏడాది వయసు ఉండగా తండ్రి పాటిల్ శేసిరెడ్డి 1996 ఏప్రిల్ 18న గోనెగండ్లలో అత్యంత దారుణంగా ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యాడు ఎన్నికల ప్రచారంలో ఉండగా ఈ దారుణం జరిగింది. అప్పటికి ఏడాది వయసు ఉన్న వర్షా రెడ్డికి ఏమీ తెలియదు. సేసి రెడ్డి 1989 నుంచి 94 వరకు పత్తికొండ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కడప జిల్లాకు చెందిన జస్టిస్ రామచెన్నారెడ్డి కూతురు నీరజారెడ్డిని పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఎమ్మెల్సీ అగ్రికల్చర్ లో గోల్డ్ మెడలిస్ట్ .

మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి… శేశిరెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి పత్తికొండ ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆ తర్వాత హత్యకు గురవడం, ఆయన భార్య నీరజ రెడ్డి రాజకీయాల్లోకి రావడం జరిగిపోయాయి. 2004 ఎన్నికలలో పత్తికొండ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎస్వీ సుబ్బారెడ్డి చేతిలో కేవలం 2000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. వెనక్కి తిరిగి చూడకుండా తిరిగి 2009 ఎన్నికలలో ఆలూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు 2014 వరకు ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు.

2014లో కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీలో చేరి పోటీ చేశారు. ఈసారి 2024 లో ఏదో ఒక పార్టీలో చేరి పోటీ చేయాలి అనుకుంటున్నా సమయంలో రోడ్డు ప్రమాదం కబళించింది . భర్త శేసిరెడ్డి వర్ధంతిని జరిపేందుకు హైదరాబాదు నుంచి కర్నూలు వస్తుండగా గత నెల 16న రోడ్డు ప్రమాదం కాటేసింది. భర్త వర్ధంతి రోజు భార్య నీరజారెడ్డి అంత్యక్రియలు జరగడం పత్తికొండ ఆలూరు నియోజకవర్గం లలో విషాదాన్ని నింపింది. అమెరికాలో ఉన్న కూతురు హిమ వర్షా రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు వచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అప్పటినుంచి అమెరికా వెళ్లదలచుకోలేదు . రాజకీయాల్లోకి వస్తున్నట్లు హిమ వర్షా రెడ్డి ప్రకటించారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత సీఎం జగన్ ను కుటుంబీకులతో కలిశారు హిమ వర్షా రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు.

సీఎం జగన్ భుజం తట్టి రాజకీయ భవిష్యత్తు తాను చూసుకుంటానని హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. రానున్న ఎన్నికలలో ఆలూరు నుంచి పోటీ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం ఆలూరు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం రానున్న ఎన్నికలలో కర్నూలు ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో హిమ వర్షా రెడ్డి ఆలూరు నుంచి పోటీ చేయవచ్చని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

పైగా హిమ వర్షా రెడ్డి తల్లి నీరజ రెడ్డికి, కోట్ల కుటుంబానికి సత్సంబంధాలు లేవు ప్రస్తుతం ఆలూరు టిడిపి ఇన్చార్జిగా కోట్ల సుజాతమ్మ ఉన్నారు. ఆమెనే ఆలూరు నుంచి పోటీ చేయవచ్చని భావిస్తున్నారు. దీంతో కోట్ల సుజాత పై హిమ వర్షా రెడ్డి పోటి చేయవచ్చని గత కొన్ని రోజులుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్ అయింది.

తల్లిదండ్రుల మృతి హిమ వర్షా రెడ్డికి సానుభూతి పవనాలు ఉండవచ్చని టికెట్ విషయంపై ఇంకా ఫైనల్ డెసిషన్ రాలేదని ప్రచారం జరుగుతుంది. మొదటి ప్రాన్యతగా ఆలూరు.. తర్వాత పత్తికొండ ఏదైనా పర్వాలేదని టికెట్ ఇస్తే గెలిచి జగనన్నకు కానుకగా ఇస్తామని అంటున్నారు వర్షా రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు. ఏది ఏమైనప్పటికీ టికెట్ వస్తుందో రాదో తెలియనప్పటికీ ఆలూరు పత్తికొండ నియోజకవర్గంలలో వర్షా రెడ్డి రాజకీయ ఆరంగేట్రం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం