Jagananna colonies : రాష్ట్రంలో కొత్తగా 17 వేల జగనన్న కాలనీలు, పేదరికమే ప్రామాణికంగా నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు : గృహ నిర్మాణ శాఖ మంత్రి
పేదరికమే ప్రామాణికంగా రాష్ట్రంలోని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరిగిందన్నారు..
Minister of Housing Cherakuwada Sriranganathraju : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్తగా 17 వేల జగనన్న కాలనీలు రాబోతున్నాయని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాథ రాజు చెప్పారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పిన ఆయన, పేదరికమే ప్రామాణికంగా రాష్ట్రంలోని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇళ్ల నిర్మాణం కూడా పూర్తిచేస్తామన్నారు. తొలి విడతలో విజయనగరం జిల్లాలో 98వేల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. పేదలందరికీ ఇళ్లు, జగనన్న కాలనీలపై మంత్రి శ్రీరంగనాథరాజు విజయనగరంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లోని ప్రతి కుటుంబంలో ఆర్థికాభివృద్ధి పెరుగుతోందని.. దీనికి సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనే కారణమని మంత్రి తెలిపారు.
Read also : VHP : అయోధ్య శ్రీరామాలయానికి సమర్పించిన ప్రతి రూపాయికి ట్రస్టు జవాబుదారిగా ఉంటుంది : అలోక్ కుమార్