AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambati : టీడీపీ నేతల భూకబ్జాలను చంద్రబాబు సమర్ధిస్తారా?. ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు సూటి ప్రశ్న

ప్రభుత్వ భూములను పప్పుబెల్లాల్లా పంచుకుంటే చూస్తూ ఊరుకోవాలా?. టీడీపీ నేతలు భూకబ్జాలు చేయలేదని చంద్రబాబు చెప్పగలరా?. అని అంబటి సవాల్ విసిరారు. చంద్రబాబుకు అధికార, ధనకాంక్ష తప్ప మరో ఆలోచన లేదంటూ..

Ambati : టీడీపీ నేతల భూకబ్జాలను చంద్రబాబు సమర్ధిస్తారా?.  ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు  సూటి ప్రశ్న
Ambati Rambabu
Venkata Narayana
|

Updated on: Jun 15, 2021 | 11:53 PM

Share

YCP MLA Ambati challege Chandrababu : టీడీపీ నేతల భూకబ్జాలను టీడీపీ అధినేత చంద్రబాబు సమర్ధిస్తారా?. అని సూటిగా ప్రశ్నించారు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు. ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటే కక్షసాధింపు ఎలా అవుతుందని ఆయన నిలదీశారు. ప్రభుత్వ భూములను పప్పుబెల్లాల్లా పంచుకుంటే చూస్తూ ఊరుకోవాలా?. టీడీపీ నేతలు భూకబ్జాలు చేయలేదని చంద్రబాబు చెప్పగలరా?. అని అంబటి సవాల్ విసిరారు. చంద్రబాబుకు అధికార, ధనకాంక్ష తప్ప మరో ఆలోచన లేదంటూ అంబటి రాంబాబు దుయ్యబట్టారు.

ప్రజల ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఎమ్మెల్యే అంబటి అన్నారు. టీడీపీ హ‌యాంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో టీడీపీ నేతలు భారీగా భూకబ్జాలు చేశారని ఆయన ధ్వజమెత్తారు.

మంగళవారం తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అంబ‌టి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. టీడీపీ నేతల ఆక్రమణలో ఉన్న భూములను స్వాధీనం చేసుకుంటున్నామన్నారు. లీజులు ముగిసినా కూడా భూములు ఖాళీ చేయలేదన్నారు. గతంలో చేసిన వ్యాఖ్యలు అయ్యన్న మర్చిపోయారా? భూ కబ్జాలపై అప్పటి మంత్రి అయ్యన్న ఫిర్యాదు చేసింది గుర్తులేదా? అని ఆయన ప్రశ్నించారు.

Read also : Hyper Aadi : ‘బాధపెట్టడం..  క్షమాపణ చెప్పడం సరైన విధానం కాదు.. సరైన సమయంలో సరైన రీతిలో ‘హైపర్ ఆది’కి బుద్ధి చెప్తాం’