ప్రమాదపు అంచున “బెజవాడ”…!

ప్రమాదపు అంచున బెజవాడ...!

విజయవాడకు పెద్ద ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. సాధారణంగా సముద్రానికి దగ్గరగా ఉంటే నగరాలకు ఎప్పుడు ముప్పు వస్తుందో తెలియదు. చాలా చోట్ల సముద్రాల్లోని భూ పలకాల్లో కదలిక ఏర్పడినప్పడు భూకంపాలు, సునామీలు వస్తాయి. అయితే దేశవ్యాప్తంగా చూసుకుంటే మొత్తం 50 నగరాల్లో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌, నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (NDMA), కేంద్ర ప్రభుత్వం కలిసి… భూకంప ప్రభావిత ప్రాంతాల సూచిక […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 15, 2019 | 8:17 AM

విజయవాడకు పెద్ద ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. సాధారణంగా సముద్రానికి దగ్గరగా ఉంటే నగరాలకు ఎప్పుడు ముప్పు వస్తుందో తెలియదు. చాలా చోట్ల సముద్రాల్లోని భూ పలకాల్లో కదలిక ఏర్పడినప్పడు భూకంపాలు, సునామీలు వస్తాయి. అయితే దేశవ్యాప్తంగా చూసుకుంటే మొత్తం 50 నగరాల్లో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌, నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (NDMA), కేంద్ర ప్రభుత్వం కలిసి… భూకంప ప్రభావిత ప్రాంతాల సూచిక రిపోర్టును రెడీ చేశాయి. సముద్రతీర ప్రాంతాల్లో ఎంతమంది ప్రజలు ఉంటున్నారు..? ఇళ్ల నిర్మాణం ఎలా ఉంది? ప్రస్తుతం వాటి పరిస్థితి ఏంటి..? సముద్రానికి ఎంత దూరంలో ఉన్నాయి..? గతంలో ఎప్పుడైనా అక్కడ భూకంపాలు వచ్చాయా..? వంటి అంశాలను లెక్కలోకి తీసుకుని పరిశోధన చేశాయి. సుమారు మూడేళ్ల పాటు.. ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌లోని ఎర్త్‌క్వేక్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (ERCC) చీఫ్ ప్రొఫెసర్ ప్రదీప్ తన విద్యార్థులతో కలిసి ఈ రిపోర్టును సిద్ధం చేశారు. ఆ రిపోర్ట్‌ని ఐఐటీ ప్రొఫెసర్లు, కేంద్రం మళ్లీ చెక్ చేశాయి.

దేశవ్యాప్తంగా చూసుకుంటే మొత్తం 50 నగరాలకు భూకంప ప్రభావం ఉండగా.. వాటిలో 13 నగరాల్లో తీవ్రమైన భూకంపాలు రానున్నట్లు రిపోర్టులో తేలిసింది. 30 నగరాల్లో రిక్టర్ స్కేలుపై 4 నుంచీ 6 తీవ్రతతో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక… 7 నగరాల్లో అంతంతమాత్రంగా భూకంపాలు రానున్నాయి. ఐతే… అధిక భూకంపాలు వస్తాయని చెప్పిన నగరాల్లో విజయవాడ కూడా ఉంది. దాంతోపాటూ… ఢిల్లీ, కోల్‌కతా, పుణె, ముంబై, చెన్నై, అహ్మదాబాద్‌, సిలిగురి, డార్జిలింగ్‌, ఛండీగఢ్‌ వంటి నగరాలు ఉన్నాయి. అందువల్ల ప్రజలు జాగ్రత్తపడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇళ్లలో ఉన్నప్పుడు ఎదైనా కదలిక వస్తే… వెంటనే ఇళ్లలోంచీ బయటకు వచ్చేయాలని చెబుతున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu