రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు.. సీఎం భరోసా..

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రైతుల జీవితాల్లో కొత్త వెలుగు తీసుకొచ్చారు. రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో నేడు రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నారు. కౌలు రైతులకు కార్డులు ఇవ్వడంతోపాటు.. రైతులకు రైతు భరోసా పథకం కింద వ్యవసాయ పెట్టుబడి సాయంగా చెక్కులు ఇవ్వనున్నారు. ఇప్పటివరకు రైతు భరోసా కింద అందజేస్తున్న రూ.12,500లకు రూ.1000 పెంచారు. ఇప్పటి నుంచి రూ.13,500 ఇవ్వాలని వైసీపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇక, […]

రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు.. సీఎం భరోసా..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 15, 2019 | 7:28 AM

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రైతుల జీవితాల్లో కొత్త వెలుగు తీసుకొచ్చారు. రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో నేడు రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నారు. కౌలు రైతులకు కార్డులు ఇవ్వడంతోపాటు.. రైతులకు రైతు భరోసా పథకం కింద వ్యవసాయ పెట్టుబడి సాయంగా చెక్కులు ఇవ్వనున్నారు. ఇప్పటివరకు రైతు భరోసా కింద అందజేస్తున్న రూ.12,500లకు రూ.1000 పెంచారు. ఇప్పటి నుంచి రూ.13,500 ఇవ్వాలని వైసీపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇక, నాలుగేళ్లపాటు రూ.12,500 ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో జగన్ హామీ ఇవ్వగా.. ఇప్పుడు ఐదేళ్ల పాటు రూ.13,500లు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. దీంతో ఈ ఐదేళ్లలో రూ.67,500 రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతులకు అవసరాలను అవసరాలను దృష్టిలో ఉంచుకుని మూడు విడతలలో పెట్టుబడి సహాయం చేయాలని రైతు ప్రతినిధులు సూచించారు. రైతులు, రైతు ప్రతినిధుల డిమాండ్లను సీఎంకు వ్యవసాయ మిషన్‌ సభ్యులు వివరించారు. మొత్తం మూడు విడతల్లో రైతు భరోసా డబ్బు పంపిణీ చేయనున్నారు. మే నెలలో రూ.7,500, ఖరీఫ్‌ పంట కోసే సమయంలో, రబీ అవసరాలకోసం రూ.4000, సంక్రాంతి పండుగ సమయంలో రూ.2వేలు అందజేయనున్నారు.