జగన్, చిరంజీవిల్లో అదొక్కటే కామన్ పాయింట్..!!

సైరా సక్సెస్ తో జోరుమీదున్న మెగాస్టార్ చిరంజీవి సోమవారం నాడు విశేషంగా వార్తల్లో నిలిచారు. పేపర్లు, టీవీలు, సోషలమీడియా మాధ్యమాలతోపాటు ఏ వెబ్ సైట్ చూసినా చిరంజీవి, జగన్ ల భేటీపైనే వినూత్న కథనాలతో రెచ్చిపోతున్నాయి. సూపర్ మెజారిటీతో ముఖ్యమంత్రి పీఠమెక్కిన జగన్ మోహన్ రెడ్డి ప్రచారంలో తానిచ్చిన హామీలను నెరవేర్చడానికి నాలుగు నెలలుగా శ్రమిస్తున్నారు. ఇటువైపు రాజకీయాలు వద్దనుకుని సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన రెండేళ్ల కష్టం ఫలించి సైరా నరసింహారెడ్డి […]

జగన్, చిరంజీవిల్లో అదొక్కటే కామన్ పాయింట్..!!
Follow us
Rajesh Sharma

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 15, 2019 | 7:30 PM

సైరా సక్సెస్ తో జోరుమీదున్న మెగాస్టార్ చిరంజీవి సోమవారం నాడు విశేషంగా వార్తల్లో నిలిచారు. పేపర్లు, టీవీలు, సోషలమీడియా మాధ్యమాలతోపాటు ఏ వెబ్ సైట్ చూసినా చిరంజీవి, జగన్ ల భేటీపైనే వినూత్న కథనాలతో రెచ్చిపోతున్నాయి. సూపర్ మెజారిటీతో ముఖ్యమంత్రి పీఠమెక్కిన జగన్ మోహన్ రెడ్డి ప్రచారంలో తానిచ్చిన హామీలను నెరవేర్చడానికి నాలుగు నెలలుగా శ్రమిస్తున్నారు. ఇటువైపు రాజకీయాలు వద్దనుకుని సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన రెండేళ్ల కష్టం ఫలించి సైరా నరసింహారెడ్డి సక్సెస్ అయిన ఆనందంలో వున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి భేటీ రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ముఖ్యమంత్రిగా జగన్ పదవీ బాధ్యతలు చేపట్టి నాలుగు నెలలు అవుతున్నా సినీ రంగంలోని పెద్దవారెవరూ ఏపీ ముఖ్యమంత్రిని కలిసింది లేదు. ఈ విషయంలో సినీ నటుడు, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ బాహాటంగానే స్పందించారు. ఈ క్రమంలో ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రిని కల్వడం ఖచ్చితంగా చర్చనీయాంశమే. ఈ నేపథ్యంలో ఇద్దరికి సంబంధించిన కామన్ పాయింట్ ఒకటి వెలుగు లోకి వచ్చింది. అదేంటంటే…

సుదీర్ఘ పాద యాత్ర తర్వాత జరిగిన గత మే నెలలో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ బంపర్ మెజారిటీతో, రికార్డు సీట్లతో సీఎం సీటెక్కారు. ఇటు పదేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఓటములనే ఎక్కువగా చవి చూసిన చిరంజీవి… తన సత్తా చూపేందుకు సినీ రంగమే కరెక్టన్న నిర్ణయానికొచ్చి టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. తన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150తో తెలుగు ప్రేక్షకులకు మరోసారి మెగాస్టార్ అంటే ఏంటో చూపించారు. సరిగ్గా ఇక్కడే జగన్, చిరంజీవిల మధ్య ఓ కామన్ పాయింట్ వెలుగులోకి వచ్చింది.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ పార్టీ వైసీపీ సాధించిన సీట్ల సంఖ్య 151. ఇటు చిరంజీవి నటించిన 151వ మూవీ సైరా నరసింహారెడ్డి… సో.. సోమవారం వీరిద్దరి మధ్య కుదిరిన భేటీలో ఇద్దరిలో కామన్ పాయింటేంటా అని చూస్తే 151 నెంబరే వీరిద్దరి కామన్ పాయింట్ అన్న క్లారిటీ వచ్చింది. సో .. అదన్న మాట సంగతి !!

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం