AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఔను..వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూనే వున్నారు..!

వారం రోజులుగా ఉత్కంఠ రేకెత్తించిన జగన్, చిరంజీవిల భేటీ ఎట్టకేలకు ముగిసింది. అయితే కథలో ట్విస్టును భేటీ తర్వాత చిరంజీవి స్వయంగా రివీల్ చేశారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీ అవుతున్నారని వారం క్రితం కథనాలు రావడంతోనే ఇంతకాలం దూరదూరంగా వున్న వీరిద్దరు ఇంత సడన్ గా ఎందుకు కలుస్తున్నారు ? అనే అంశం రాజకీయ, సినీ వర్గాలతో పాటు వైసీపీ వర్గాల్లోను, మెగాస్టార్ అభిమానుల్లోను చర్చ పెద్ద ఎత్తున మొదలైంది. […]

ఔను..వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూనే వున్నారు..!
Rajesh Sharma
| Edited By: |

Updated on: Oct 14, 2019 | 7:25 PM

Share

వారం రోజులుగా ఉత్కంఠ రేకెత్తించిన జగన్, చిరంజీవిల భేటీ ఎట్టకేలకు ముగిసింది. అయితే కథలో ట్విస్టును భేటీ తర్వాత చిరంజీవి స్వయంగా రివీల్ చేశారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీ అవుతున్నారని వారం క్రితం కథనాలు రావడంతోనే ఇంతకాలం దూరదూరంగా వున్న వీరిద్దరు ఇంత సడన్ గా ఎందుకు కలుస్తున్నారు ? అనే అంశం రాజకీయ, సినీ వర్గాలతో పాటు వైసీపీ వర్గాల్లోను, మెగాస్టార్ అభిమానుల్లోను చర్చ పెద్ద ఎత్తున మొదలైంది. కేవలం సైరా మూవీ సక్సెస్ అయిన నేపథ్యంలో సీఎంను కల్వాలని చిరంజీవి భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెప్పుకొచ్చారు.  సినిమా విడుదలైన మొదటి 2 వారాల్లో షోల సంఖ్యను పెంచుకునేందుకు అనుమతించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పేందుకే అభిమాన నటుడు జగన్ని కలుస్తున్నారని మెగా ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. అయితే మెగా ఫ్యాన్స్ లోనే స్పష్టమైన విభజన కనిపించింది. మెగా అభిమానుల్లో పవన్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఈ భేటీపై మండిపడ్డారు.

ఈ క్రమంలో సోమవారం హైదరాబాద్ నుంచి విజయవాడ  చేరుకున్న చిరంజీవి దంపతులు… ముఖ్యమంత్రి జగన్ను అమరావతిలో కలుసుకున్నారు. వీరిద్దరి విందు సమావేశానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు, చిరంజీవి తనయుడు రామ్ చరణ్ దంపతులు కూడా హాజరవుతారని భారీ ఎత్తున ప్రచారం జరిగినా చివరికి ముఖ్యమంత్రి జగన్ దంపతులు, మెగాస్టార్ చిరంజీవి దంపతులు మాత్రమే హాజరయ్యారు. ఈ నలుగురి భేటీ సుహృద్భావ వాతావరణంలో జరిగిందని చిరంజీవి చెప్పుకొచ్చారు. సీఎంవో కూడా దాదాపు ఇదే మెసేజ్ ని మీడియాకు పాస్ ఆన్ చేసింది.

అయితే.. విశేషం ఏంటంటే.. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు నెలలకు చిరంజీవి “తొలిసారి” కలుస్తున్నారంటూ జరిగిన ప్రచారం పూర్తిగా సత్యదూరమని సాక్షాత్తు చిరంజీవి వెల్లడించారు. జగన్ మోహన్ రెడ్డితో తాను రెగ్యులర్ గా టచ్ లోనే వున్నానని, తరచూ తామిద్దరం మాట్లాడుకుంటూనే వున్నామని చిరంజీవి కుండబద్దలు కొట్టారు. ఇది విన్న మీడియా షాక్ గురికాగా.. మెగాస్టార్ మాత్రం నవ్వుతూ నిష్క్రమించారు.

నిజానికి ఒకవైపు పవన్ కల్యాణ్.. జగన్ సర్కార్ కు వంద రోజుల గడువు ఇచ్చి, అది పూర్తి కాగానే.. విమర్శల పర్వం ప్రారంభించి, ఆరోపణల అస్త్రం సంధించడం మొదలుపెట్టారు. దాంతో పవన్ కల్యాణ్ చంద్రబాబుకు అనుకూలం, జగన్ కు వ్యతిరేకం అన్ని అభిప్రాయాలు సర్వత్రా వినిపించాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ సోదరుడు చిరంజీవి.. ముఖ్యమంత్రిని కల్వడం.. అది కూడా తామిద్దరం రెగ్యులర్ గా మాట్లాడుకుంటూనే వున్నాం అని వెల్లడించడంతో మెగాఫ్యాన్స్ నివ్వెరపోయారు. తమ్ముని రాజకీయ ప్రత్యర్థితో చిరంజీవి తరచూ ఏం మాట్లాడుకుంటారబ్బా అని మీడియాలో గుసగుసలు మొదలయ్యాయి.

ఇక్కడ ఇంకో విషయం ఆసక్తికరంగా మారింది. జగన్ తో భేటీకి ముందే చిరంజీవి తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని కల్వడం.. జగన్ ని తానెందుకు కలుస్తున్నానో ముందే తన సోదరునికి చిరంజీవి చెప్పి మరీ వెళ్ళాడంటే… ఇందులో మతలబేంటన్నది ఆసక్తి రేపుతోంది. జగన్ తో చిరంజీవి రెగ్యులర్ గా టచ్ లో వున్నానని చెప్పడం.. అదే సమయంలో సీఎంని కల్సే ముందే జనసేనాధిపతితో భేటీ అయి మరీ వెళ్ళడం.. చర్చనీయాంశం కాగా.. ఇదేం తరహా రాజకీయం రా బాబూ.. అని జనం చెవులు కొరుక్కుంటున్నారు.