కెసీఆర్ స్టాండ్ కు అపరమేధావి ఫిదా !
కార్మికుల గొంతెమ్మ కోర్కెలను తోసిపుచ్చి.. ఆర్టీసీని పరిరక్షించేందుకు కంకణం కట్టుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అనూహ్యంగా ఓ మేధావి నుంచి మద్దతు లభించింది. ఛాన్స్ దొరికింది కదాని ఆర్టీసీ సమ్మె సాకుగా కెసీఆర్ పై తెలంగాణలోని రాజకీయ పార్టీలన్నీ దుమ్మెత్తి పోస్తున్న తరుణంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల విధానాలను సునిశితంగా విశ్లేషించే ఓ వ్యక్తి కెసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించారు. స్వాగతించడమే కాకుండా ఇంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్న కెసీఆర్ ను దమ్మున్న నాయకునిగా అభివర్ణించారు. ఇంతకీ […]
కార్మికుల గొంతెమ్మ కోర్కెలను తోసిపుచ్చి.. ఆర్టీసీని పరిరక్షించేందుకు కంకణం కట్టుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అనూహ్యంగా ఓ మేధావి నుంచి మద్దతు లభించింది. ఛాన్స్ దొరికింది కదాని ఆర్టీసీ సమ్మె సాకుగా కెసీఆర్ పై తెలంగాణలోని రాజకీయ పార్టీలన్నీ దుమ్మెత్తి పోస్తున్న తరుణంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల విధానాలను సునిశితంగా విశ్లేషించే ఓ వ్యక్తి కెసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించారు. స్వాగతించడమే కాకుండా ఇంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్న కెసీఆర్ ను దమ్మున్న నాయకునిగా అభివర్ణించారు. ఇంతకీ ఆయనెవరంటే…
తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టసీ సమ్మె అంశంపై కెసీఆర్ విధానాలు పరిపూర్ణంగా సమంజసమేనని అభిప్రాయపడింది ఎవరో కాదు.. అవినీతి రహిత సమాజం కోసం లోక్ సత్తాను స్థాపించి.. ఆతర్వాత దాన్ని రాజకీయ పార్టీగా మార్చి ఒక దఫా ఎమ్మెల్యేగా కూడా ఎన్నికైన మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ్. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు చేస్తున్న డిమాండ్లు పూర్తి అసంబద్దమని జెపి ఖరాఖండీగా తన అభిప్రాయాన్ని వెలువరించారు. అందుకే కెసీఆర్ స్టబర్న్ విధానాలను తాను పూర్తిగా సమర్థిస్తున్నానని చెప్పారు జెపి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సరైన చర్య కాదని, ప్రభుత్వాన్ని శాసించాలనుకునేలా వున్న ఆర్టీసీ యూనియన్ల ధోరణి పూర్తిగా ఖండించదగినదాని జెపి అంటున్నారు.
గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కెసీఆర్ తో విభేధించిన జెపి, తాజాగా ఆర్టీసీ విషయంలో పూర్తిగా సమర్థించడం గమనార్హం. విద్యార్థులతోపాటు ప్రయాణీకులంతా అష్ట కష్టాలు పడుతున్న తరుణంలో ఆర్టీసీ యూనియన్లు మొండిగా వ్యవహరించడాన్ని పలువురు దుయ్యబడుతున్న తరుణంలో జెపి లాంటి అపర మేధావులు కెసీఆర్ ప్రభుత్వ విధానాలను సమర్థించేలా మాట్లాడడం చర్చనీయాంశమైంది.