‘వాళ్ల పాపాన వాళ్లే పోతారు’.. అసెంబ్లీలో పరిణామాలపై ఘాటుగా రియాక్ట్ అయిన నారా భువనేశ్వరి
Nara Bhuvaneshwari: అసెంబ్లీలో ఇటీవలి పరిణామాలపై కొంచెం ఘాటుగానే రియాక్ట్ అయ్యారు నారా భువనేశ్వరి. తనను అమానించిన వాళ్లు... వాళ్ల పాపాన వాళ్లే పోతారని వ్యాఖ్యానించారు.
Chandrababu Wife: అసెంబ్లీలో ఇటీవలి పరిణామాలపై కొంచెం ఘాటుగానే రియాక్ట్ అయ్యారు నారా భువనేశ్వరి. తనను అమానించిన వాళ్లు… వాళ్ల పాపాన వాళ్లే పోతారని వ్యాఖ్యానించారు. వాళ్లు వచ్చి సారీ చెబుతారని తానేమీ ఎదురు చూడటం లేదన్నారు భువనేశ్వరి. ఆ విషయాల గురించి ఆలోచించి టైమ్ వేస్ట్ చేయడం తనకు ఇష్టం లేదన్నారు. ఎవరైనా సరే మహిళల్ని గౌరవించాలని, నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. అన్నీ పరిస్థితుల్లోనూ కుటుంబ సభ్యులు ఎప్పుడూ తనకు మద్దతుగా నిలడ్డారని చెప్పారు. హెరిటేజ్‌ను కూలగొట్టడానికి చాలామంది ట్రై చేశారని.. సంస్థ కార్యకలాపాలు చాలా ట్రాన్స్పరెంట్‌గా ఉంటాయని.. ఎవరూ టచ్ చేయలేరని స్పష్టం చేశారు.
తిరుపతిలో ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయాన్ని సందర్శించిన నారా భువనేశ్వరి.. వరద ప్రమాద మృతులకు ట్రస్ట్ తరఫున ఆర్థికసాయం అందజేశారు. మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం ఇచ్చారు. దేశంలో ఏ ఆపద వచ్చినా.. ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుంటుందని చెప్పారు.