Tarakaratna: తారకరత్న లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్.. విదేశీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స..
తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆయన కోలుకుంటున్నారా? ఆరోగ్యం మెరుగుపడుతోందా? వైద్యులు ఏమంటున్నారు? కుటుంబసభ్యులు ఏం చెబుతున్నారంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు.
లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్నకు కుప్పంలో హార్ట్ స్ట్రోక్ వచ్చింది. స్పృహ కోల్పోయిన ఆయన్ని స్థానిక హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. గుండెలో బ్లాక్స్ ఉన్నాయని తెలియడంతో, మెరుగైన వైద్యం కోసం బెంగుళూరుకు తరలించారు. తారకరత్న భార్య, కుమార్తెతో పాటు పురంధేశ్వరి, ఇతర కుటుంబసభ్యులందరూ హుటాహుటిన బెంగుళూరుకు చేరుకున్నారు. బెంగుళూరు నారాయణ హృదయాలయాలో చికిత్స మొదలుపెట్టారు. తారకరత్న హెల్త్ కండిషన్ క్రిటికల్‌గా ఉందని, వైద్యులు శాయశక్తులా కృషి చేస్తున్నారని హాస్పిటల్ బులెటిన్ కూడా విడుదల చేసింది. తారకరత్నకు ఎక్మో పెట్టారని మొదట్లో వార్తలొచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని, లైఫ్ సపోర్ట్ మీద ఉన్నారని క్లారిటీ ఇచ్చారు రామకృష్ణ. న్యూరో సమస్యలున్నాయని వైద్యులు చెప్పారని, మెరుగైన వైద్యం చేస్తున్నారని చెప్పారు రామకృష్ణ.
తారకరత్న ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటూ హాస్పిటల్‌లోనే కనిపించారు బాలకృష్ణ. నందమూరి కల్యాణ్‌రామ్, ఎన్టీఆర్ బెంగుళూరుకు వెళ్లి తారకరత్న ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి అందిస్తున్న సపోర్ట్ మరువలేనిదని, అత్యుత్తమ వైద్యులను పిలిపించి వైద్యం అందిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పారు తారక్. తారకరత్న ఆరోగ్యం కుదుటపడాలని కల్యాణ్‌రామ్ కూడా కోరుకున్నారు. చంద్రబాబు, మంచు మనోజ్‌తో పాటు పలువురు తారకరత్నను హాస్పిటల్‌కి వెళ్లి చూశారు. చికిత్సకు స్పందిస్తున్నారని, కోలుకుంటున్నారని వార్తలు రావడంతో అభిమానులు కాస్త ఊరట చెందారు. మెరుగైన వైద్యం కోసం సింగపూర్‌కి తీసుకెళ్తారనే ప్రచారం కూడా ఆ మధ్య జరిగింది. అయితే విదేశీ వైద్యుల పర్యవేక్షణతోనే ఇక్కడ చికిత్స అందుతుందనే మాట కూడా మళ్లీ వినిపించింది.
సన్నిహిత వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు.. ప్రజంట్ తారకరత్నను సృహలోకి తెచ్చేందుకు న్యూరాలజీ నిపుణులు విసృతంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. అన్ని రకాల ప్రయత్నాలను డాక్టర్లు చేస్తున్నారట. ఎప్పటికప్పుడు టెస్టులు చేస్తూ.. డెవలప్‌మెంట్ ఏమైనా ఉందా అని తెలుసుకుంటున్నారట. మంగళవారం, లేదా బుధవారం మరోసారి ఆస్పత్రి వర్గాలు తారకరత్న హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం.. క్లిక్ చేయండి