AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Perni Nani: ఎన్టీఆర్ మృతిపై విచారణ చేయాలి.. పుస్తకంలో ఆ పేర్లు ఎందుకు రాయలేదు.. పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ.. టీడీపీ నేతలు తీసుకువచ్చిన 'జగనాసుర రక్త చరిత్ర’ పుస్తకంపై మాజీ మంత్రి పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్..

Perni Nani: ఎన్టీఆర్ మృతిపై విచారణ చేయాలి.. పుస్తకంలో ఆ పేర్లు ఎందుకు రాయలేదు.. పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్..
Perni Nani
Ganesh Mudavath
|

Updated on: Feb 11, 2023 | 5:17 PM

Share

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ.. టీడీపీ నేతలు తీసుకువచ్చిన ‘జగనాసుర రక్త చరిత్ర’ పుస్తకంపై మాజీ మంత్రి పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పై విషపురాతలు రాసి జగనాసుర అనే పేరు పెట్టారని ఫైర్ అయ్యారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడికి బాడీ తప్ప బ్రెయిన్ లేదని విమర్శించారు. అసలు జగనాసుర అనే పుస్తకంలో ఎక్కడా టీడీపీ పేరు గానీ.. చంద్రబాబు పేరు గానీ లేవని, ఎందుకు ఇంత భయపడుతున్నారని ప్రశ్నించారు. నిజాయతీ ఉంటే పేరు వెయ్యాలి కదా అని ప్రశ్నించారు. వైఎస్.వివేకా హత్య జరిగిన సమయంలో రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంది. అప్పుడు చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నారు. మరి అప్పుడు ఎందుకు విచారించలేదని నిలదీశారు. అసలు వివేకా కేసులో అప్పటి ప్రభుత్వం ఎందుకు చార్జ్ షీట్ వెయ్యలేదన్న పేర్ని నాని.. ఎన్టీఆర్ చనిపోయినప్పడు కనీసం సీబీసీఐడి విచారణకు కూడా బాబు ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివేకా హత్య జరిగిన సమయంలో అప్పటి ప్రభుత్వంలో ఎందుకు కదలిక లేదు. టీడీపీ ప్రభుత్వం విచారణ ఎందుకు చెయ్యలేదు. కోడెల మరణంపై పుస్తకం ఎందుకు వెయ్యలేదు. చంద్రబాబు అవమానాలు భరించలేక చనిపోతున్నానని కోడెల చెప్పారా. ఎన్టీఆర్ కుమార్తె మరణంపై కూడా పుస్తకం వేసి సీబీఐకి విచారణకు ఇవ్వాలి. ఎన్టీఆర్ పైనే కుట్ర పన్ని నాశనం చేశారు. ఎన్టీఆర్ కు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అనే దానిపై కూడా విచారణ చేయాలి.

       – పేర్ని నాని, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి

ఇవి కూడా చదవండి

లోకేశ్ కు కనీసం ఆంధ్రప్రదేశ్ అని కూడా సరిగ్గా రాయడం తెలియదని పేర్ని నాని ఎద్దేవా చేశారు. ముందు సరిగ్గా మాట్లాడడం నేర్చుకోవాలని లోకేశ్ కు సూచించారు.  లోకేశ్ యాత్ర జరుగుతున్న సమయంలో గవర్నర్ ను కలవడం ఎందుకని ప్రశ్నించారు. జీఓ నంబర్ ఒకటి ప్రకారం నిబంధనలు పాటించాలన్నారు. గ్రౌండ్ లో సభలు పెట్టుకుంటే ఎవరూ కాదనరని, రోడ్లపై పెడితేనే ఇబ్బంది కలుగుతోందన్నారు. పాదయాత్రకు ప్రజలు రాక.. కర్ణాటక నుంచి కిరాయికి తెచ్చుకుంటున్నారని ఘాటు గా రెస్పాండ్ అయ్యారు పేర్ని నాని.

మరిన్ని ఏపీ వార్తల కోసం..  క్లిక్ చేయండి