Magunta Raghava: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. పది రోజుల ఈడీ కస్టడీకి మాగుంట కుమారుడు రాఘవ..
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముమ్మర విచారణ కొనసాగుతోంది. తాజాగా.. ఈ కేసులో ఒంగోలు వైసీపీ ఎంపీ..
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముమ్మర విచారణ కొనసాగుతోంది. తాజాగా.. ఈ కేసులో ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో దర్యాప్తు చేసిన అనంతరం ఆయనను అరెస్టు చేశారు. వారం రోజుల వ్యవధిలో ఈడీ అధికారులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును హైదరాబాద్‌లో మంగళవారం సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరింత సమాచారం రాబట్టేందుకు ఆయనను అయిదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ తరఫు న్యాయవాదులు ప్రత్యేక జడ్జికి విజ్ఞప్తి చేశారు.
వాదనల అనంతరం ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్ బుచ్చిబాబును శనివారం వరకు (మూడు రోజులు) సీబీఐ కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పంజాబ్‌కు చెందిన మద్యం వ్యాపారి, ఒయాసిస్ గ్రూప్ ప్రమోటర్ గౌతమ్ మల్హోత్రాను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఏడు రోజుల ఈడీ కస్టడీకి ఇచ్చింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం.. క్లిక్ చేయండి