ఏపీలోని ఆ ప్రాంతంలో పక్షులు, జంతువుల వింత మరణాలు.. అసలు అలా ఎలా జరుగుతుంది..?
కంటికి కనిపించకుండా మూగ జీవాల్ని బలి తీసుకుంటున్నాయి. రోజూ ఏదో ఓ చోట జీవాల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అసలు ఈ మరణాలకు కారణాలు ఏంటి.?.
కంటికి కనిపించకుండా మూగ జీవాల్ని బలి తీసుకుంటున్నాయి. రోజూ ఏదో ఓ చోట జీవాల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అసలు ఈ మరణాలకు కారణాలు ఏంటి.?. మొన్న ఆ బజార్లో 15 కాకులు చచ్చిపోయి రోడ్లపై పడి ఉన్నాయి. నిన్న వేరే సందులో నాలుగు కొంగలు, మూడు పందులు ప్రాణాలు విడిచాయి. తాజాగా శివాలయం వీధిలో రెండు కుక్కలు చనిపోయాయి. అంతే ఆ ఊళ్లో అంతా భయపడిపోతున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతోందో ఎవ్వరికి అంతు చిక్కడం లేదు.
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురులోని శివాలయం సమీపంలో ఈ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. శివాలయం దగ్గర్లోనే వారం రోజుల నుంచి మూగజీవాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. రోజు ఏదో ఒక చోట పక్షులు, జంతువులు చనిపోవడంతో గ్రామస్తులు హడలిపోతున్నారు.
ఈ షాక్ నుంచి తేరుకోక ముందే గురువారం మధ్యాహ్నం ఓ కుక్క గ్రామస్తులు చూస్తుండగానే దానంతటకదే గిలగిల కొట్టుకొని చనిపోయింది. విచిత్రం ఏమిటంటే …అదే సమయంలో చనిపోయిన కుక్క దగ్గరకు వెళ్లి మరో కుక్క వాసన పీల్చిన 10 నిమిషాలకే ప్రాణాలు వదిలింది. అంతే ఈ ఘటనతో గ్రామస్తుల్లో ఒకటే భయం పట్టుకుంది. కంటికి కనిపించని పురుగు ఏదో గ్రామంలో పక్షుల్ని, జంతువుల ప్రాణాలు తీస్తోందని అనుమానిస్తున్నారు. ఇదే విషయాన్ని అమలాపురం పశుసంవర్దకశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామస్తుల్లో ఆందోళన పెరగడంతో అధికారులు హుటాహుటిన మామిడికుదురు చేరుకొని చనిపోయిన పక్షుల శాంపిల్ సేకరించారు. పరీక్షల కోసం కాకినాడ అధికారులకు పంపించారు. శాంపిల్స్ అయితే తీసుకెళ్లారు గాని.. గ్రామస్ధుల్లో పురుగు భయం మాత్రం పోవడం లేదు. శాంపిల్ టెస్ట్ రిపోర్ట్‌లు వచ్చేలోగా ఈసారి పక్షుల ప్రాణాలు పోతాయో..లేక మనుషుల ప్రాణాలు పోతాయోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
Also Read: Viral News: చేపను కొనుగోలు చేసిన వ్యక్తి.. దాన్ని కటింగ్ చేయిస్తుండగా కడుపులో షాకింగ్ దృశ్యం
మనవడికి బైక్ ఇచ్చి అడ్డంగా బుక్కైన తాత.. ఇప్పుడు జైలుకి వెళ్లాడు.. మున్ముందు కఠిన శిక్ష