AP Weather Alert: నైరుతీ రుతుపవనాల ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం..

AP Weather Alert: నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. అరేబియా సముద్ర తీరం వెంట ఉన్న కేరళ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు...

AP Weather Alert: నైరుతీ రుతుపవనాల ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం..
Ap Weather Report
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 03, 2021 | 6:01 PM

AP Weather Alert: నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. అరేబియా సముద్ర తీరం వెంట ఉన్న కేరళ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ఇవాళ ప్రవేశించాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాగల రెండు రోజులలో నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని మిగిలి ప్రాంతాలు, మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, కేరళ, లక్షలద్వీప్ లలోని మిగిలిన ప్రాంతలు, తమిళనాడు, పుదుచ్చేరి లలోని మరికొన్ని ప్రాంతాలు, కోస్తా, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ మరియు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో విస్తరించే అవకాశం ఉందన్నారు.

ఇదిలాఉంటే.. నైరుతి రుతుపవనాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ ఉత్తర కోస్తాంద్రలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

అలాగే, దక్షిణ కోస్తాంధ్రలో ఈ రోజుల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు అవకాశం ఉంది. రేపు దక్షిణ కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి వర్షాలు కురువనున్నాయి. శనివారం నాడు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

రాయలసీమలో ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపుతో కూడిన వర్షాలు చాలా చోట్ల కురవనున్నాయి. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శనివారం నాడు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Also read:

China – Malaysia Tensions: కయ్యాలమారి చైనా దురహంకారం.. దక్షిణ చైనా సముద్రంపై యుద్ధ మేఘాలు