Eco Friendly Startup: ఓ మహిళ సాప్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి.. చెరుకు వ్యర్ధాలకు అర్ధం కల్పిస్తూ వ్యాపారం..

Eco Friendly Startup: అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ కాదేదీ కవితకనర్హం అన్నాడు శ్రీ శ్రీ.. ఇదే మాటను నిజం చేస్తూ.. ఓ మహిళా వ్యర్ధాలకు ఆకృతి కల్పించి .. వ్యాపారం చేస్తుంది.. ఓ వైపు లాభాలను ఆర్జిస్తూనే.. మరోవైపు పర్యావరణానికి మేలు చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నానికి చెందిన విజయలక్ష్మి అనే మహిళ చెరకు పిప్పితో వినియోగావస్తువులను తయారు చేస్తోంది. పదేళ్లకు పైగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన విజయ్ లక్ష్మి “హౌస్ ఆఫ్ ఫోలియం”అనే స్టార్టప్‌ను ప్రారంభించింది.ఈ స్టార్టప్‌ […]

Eco Friendly Startup: ఓ మహిళ సాప్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి.. చెరుకు వ్యర్ధాలకు అర్ధం కల్పిస్తూ వ్యాపారం..
Eco Frinedaly Business
Follow us

|

Updated on: Jun 03, 2021 | 6:08 PM

Eco Friendly Startup: అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ కాదేదీ కవితకనర్హం అన్నాడు శ్రీ శ్రీ.. ఇదే మాటను నిజం చేస్తూ.. ఓ మహిళా వ్యర్ధాలకు ఆకృతి కల్పించి .. వ్యాపారం చేస్తుంది.. ఓ వైపు లాభాలను ఆర్జిస్తూనే.. మరోవైపు పర్యావరణానికి మేలు చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నానికి చెందిన విజయలక్ష్మి అనే మహిళ చెరకు పిప్పితో వినియోగావస్తువులను తయారు చేస్తోంది. పదేళ్లకు పైగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన విజయ్ లక్ష్మి “హౌస్ ఆఫ్ ఫోలియం”అనే స్టార్టప్‌ను ప్రారంభించింది.ఈ స్టార్టప్‌ ద్వారా పర్యావరణ అనుకూలమైన మరియు బయోడిగ్రేడబుల్ ప్లేట్లను వినియోగదారులకు అందిస్తోంది.

నిజానికి ఎలా చెరకు పిప్పితో ప్లేట్ల తయారీని మొదటి చైనాలో ప్రారంభించారు. దీనిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న విజయ్ లక్ష్మి పరిశోధన సాగించారు. తన పరిశోధనలో వెదురు, పామ్, చెరకు గుజ్జు, ఇతర వ్యవసాయ వ్యర్థాల నుండి పర్యావరణ అనుకూలమైన వంట సామాగ్రిని తయారు చేయగలమని గుర్తించారు. వీటిల్లో చెరకు ముడి పదార్దానికి కొరత ఉండదని భావించి దీనిని ఎంచుకుని తన వ్యాపారాన్ని మొదలు పెట్టారు విజయలక్ష్మి.

2018 చివరిలో, విజయ్ లక్ష్మి తన ఉద్యోగాన్ని కి గుడ్ బై చెప్పి.. స్టార్టప్ ‘హౌస్ ఆఫ్ ఫోలియంను ,మొదలు పెట్టారు. క్రోకరీని తయారుచేసే కొంతమంది స్థానిక తయారీదారులతో జతకట్టిన విజయలక్ష్మి పర్యావరణ అనుకూలమైన ప్లేట్లు గ్లాసుల తయారు చేయడం మొదలు పెట్టారు. ఇద్దరు వ్యక్తులతో ప్రారంభమైన ఏ వ్యాపారం నేడు అనేక మందికి ఉపాధినిస్తుంది. రోజు రోజుకీ వినియోగదారుల నుంచి అర్డ్సర్స్ పెరగడంతో పనిచేసేవారి సంఖ్య కూడా పెరిగింది. ఇక విజయలక్ష్మి పర్యావరణ అనుకూలమైన ప్లేట్లు గ్లాసులు, ప్యాకింగ్ బాక్సులను అందిస్తున్నారు. వీటి తయారీ కోసం ముందుగా చెరకు వ్యర్థాలను రైతుల నుండి కొనుగోలు చేస్తారు. తర్వాత వాటిని కొంతకాలం నానాబెడతారు. తర్వాత యంత్రాలలో ప్రాసెస్ చేసి వస్తువులుగా మారుస్తారు. ఇది పూర్తిగా బయోడిగ్రేడబుల్, ఇది చెత్తలో విసిరినప్పుడు 90 రోజుల్లో కుళ్ళిపోతుంది. జంతులు వీటిని తిన్నా హానికరం కాదు.అంతేకాదు ఫ్రిడ్జ్ లో వీటిని ఉంచుకోవచ్చు.. మైక్రో వేవ్ లో కూడా ఉపయోగించవచ్చు.ప్రస్తుతం లాక్ డౌన్ ఉన్నందున ఆహారం ప్యాకేజీ కి ఫుడ్ ఇండ స్ట్రీ నుంచి తమ ఉత్పత్తులకు భారీ ఆర్డర్స్ వస్తున్నాయని విజయలక్ష్మి చెప్పారు.. ముందు ముందు తమ టర్నోవర్ మరింత పెరుగుతుందని విజయలక్ష్మి ధీమా వ్యక్తం చేశారు.

Also Read: ముఖంపై అవాంఛిత రోమాలతో ఇబ్బందులు పడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేస్తే సరి..