AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JHEV Alpha R5: సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ జేవ్ (JHEV) అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్ లోకి విడుదల చేసింది. ఆల్ఫా ఆర్5 పేరుతో వచ్చిన ఈ వాహనం దాదాపు 300 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అలాగే తక్కువ ధరతో పాటు అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 2024లో విడుదలైన అత్యధిక రేంజ్ ఇచ్చే స్కూటర్ ఇదేనని చెప్పవచ్చు.

JHEV Alpha R5: సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
Jhev Alpha R5 Electric Scooter
Madhu
|

Updated on: Apr 25, 2024 | 6:19 PM

Share

మనం వాడే ద్విచక్ర వాహనం సుమారు 60 కిలోమీటర్ల మైలేజీ ఇస్తే సంతోష పడిపోతాం. అదే దాదాపు 100 కిలోమీటర్ల మైలేజీ వస్తుంటే ఆనందానికి అవధులు ఉండవు. అంతకు మించి మైలేజీ కోరుకోవడం కూడా అత్యాశే అవుతుంది. కానీ ఎలక్ట్రిక్ వాహనాలతో ఇది సాధ్యమవుతోంది. సింగిల్ చార్జ్ పై ఏకంగా 300 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చింది. మీరు నమ్మలేకున్నా ఇది నిజం. ఆ వాహనం ప్రత్యేకతలు, ధరల వివరాలు తెలుసుకుందాం.

ఆల్పా ఆర్5..

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ జేవ్ (JHEV) అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్ లోకి విడుదల చేసింది. ఆల్ఫా ఆర్5 పేరుతో వచ్చిన ఈ వాహనం దాదాపు 300 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అలాగే తక్కువ ధరతో పాటు అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 2024లో విడుదలైన అత్యధిక రేంజ్ ఇచ్చే స్కూటర్ ఇదేనని చెప్పవచ్చు. మంచి ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేయాలనేకునే వారికి ఇది మంచి ఎంపిక. దీని ధర కూడా సామ్యానులకు అందుబాటులో ఉంది. తక్కువ సమయంలో చార్జింగ్ అవుతుంది. మైలేజీ మాత్రం ఎక్కువ వస్తుంది.

ప్రత్యేకతలు ఇవే..

ఇతర ప్రత్యేకతల గురించి చెప్పుకుంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో పూర్తిగా డిజిటల్ ఫీచర్లు ఉన్నాయి. లోపల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో మొబైల్ కనెక్టివిటీ సిస్టమ్ కూడా ఉంది. ప్రయాణంలో మొబైల్ చార్జింగ్ అయిపోతుందని ఏమాత్రం టెన్షన్ లేకుండా బండిలోనే చార్జింగ్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్ లో 3.8కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ సహాయంతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కేవలం 43 నిమిషాల్లో చార్జింగ్ చేసుకోవచ్చు. ఒక్కసారి చార్జింగ్ పెడితే దాదాపు 300 కిలోమీటర్ల వరకూ సులభంగా నడపవచ్చు. ఇది గంటకు 75 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది.

అందుబాటు ధరలో..

మైలేజీ, ఫీచర్లు, ఫాస్ట్ చార్జింగ్ తదితర సౌకర్యాలన్నీ ఈ బండిలో ఉన్నప్పటికీ ధర మాత్రం సామాన్యులకు అందుబాటులో ఉంది. జీవో కంపెనీ కేవలం రూ.1.11 లక్షలకు (ఎక్స్ షోరూమ్) ఈ స్కూటర్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం దేశంలో విపరీతంగా పెరిగింది. సులభంగా నడపగలడం, చార్జింగ్ సౌకర్యం ఉండడంతో అందరూ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా మహిళలు వీటిని ఎక్కువగా వాడుతున్నారు. జీవ్ ఆల్పా ఆర్5 స్కూటర్ దేశంలో సంచలనం అవుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..