AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax calculator: ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఈ కాలిక్యులేటర్‌తో ఫుల్ క్లారిటీ..

ఇన్ కం ట్యాక్స్ క్యాలిక్యులేటర్‌ను ఆదాయపు పన్ను శాఖ 2023 ఫిబ్రవరి తీసుకువచ్చింది. కొత్త ఆదాయపు పన్ను విధానం బాగుంటుందా, లేకపోతే పాత విధానం ఉత్తమమా అనే విషయాన్ని పన్ను చెల్లింపుదారులు తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. దీని ద్వారా పన్ను చెల్లింపులపై స్పష్టమైన అవగాహన వస్తుంది.

Income Tax calculator: ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఈ కాలిక్యులేటర్‌తో ఫుల్ క్లారిటీ..
Income Tax
Madhu
|

Updated on: Apr 25, 2024 | 5:58 PM

Share

ఇన్ కం ట్యాక్స్ విధానంపై చాలా మందికి అవగాహన ఉండదు. ముఖ్యంగా ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి ఇబ్బంది పడతారు. నిపుణుల సాయంతోనే వీటిని రూపొందిస్తారు. మొదటి సారి చెల్లించే వారైతే గందరగోళానికి గురవుతారు. ఇలాంటి వారికి సాయంగా ఉండటానికి ఆదాయపు పన్ను కాలిక్యులేటర్ ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పాత, కొత్త పన్ను విధానాలను ఎంపిక చేసుకోవడానికి చాలా ఉపయోపడుతుంది. రెండు విధానాల్లోనూ పన్ను లెక్కించుకోవడానికి వీలుంటుంది.

2023 ఫిబ్రవరిలో..

ఇన్ కం ట్యాక్స్ క్యాలిక్యులేటర్‌ను ఆదాయపు పన్ను శాఖ 2023 ఫిబ్రవరి తీసుకువచ్చింది. కొత్త ఆదాయపు పన్ను విధానం బాగుంటుందా, లేకపోతే పాత విధానం ఉత్తమమా అనే విషయాన్ని పన్ను చెల్లింపుదారులు తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. దీని ద్వారా పన్ను చెల్లింపులపై స్పష్టమైన అవగాహన వస్తుంది.

ఆన్‌లైన్ పన్ను కాలిక్యులేటర్..

ఇంటర్నెట్‌లో ఆన్‌లైన్ పన్ను కాలిక్యులేటర్ అందరికీ అందుబాటులో ఉంటుంది. ఆదాయం, తగ్గింపులు, పన్నుచెల్లింపులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఒక వ్యక్తి కట్టాల్సిన పన్నును అంచనా వేస్తుంది.

పాత, కొత్త పన్నులతో తేడాలు..

పాత పన్ను విధానంలో మీరు టాక్స్ ను లెక్కించేటప్పుడు అనేక తగ్గింపులు, మినహాయింపులు ఉంటాయి. కానీ 2020-21లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కొత్త పాలన రాయితీ ధరలను అందిస్తుంది. ఏది ఏమైనా కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవడం ద్వారా ప్రస్తుత పాత పన్ను విధానంలో అందుబాటులో ఉన్న కొన్ని మినహాయింపులు, తగ్గింపులను ఆదాయపు పన్నుదారులు కోల్పోతారు. అయితే కాలిక్యులేటర్ ఎల్లప్పుడూ కచ్చితమైనది కాదు, అది మీకు ఒక మామూలు గైడ్‌లా మాత్రమే ఉపయోగపడుతుంది.

ఆర్థిక ప్రణాళిక..

మన ఆర్థిక ప్రణాళికలో ట్యాక్స్ ను లెక్కించడం అత్యంత ముఖ్యం. దాని ద్వారా మీ బడ్జెట్ ను సమర్థవంతంగా రూపొందించుకోవచ్చు. ఖర్చులను నియంత్రించుకుని, డబ్బులను ఆదా చేసే అవకాశం ఉంది. అలాగే అధిక వ్యయం, అప్పులు పేరుకుపోకుండా చూసుకొవచ్చు.

లెక్కించే విధానం..

ఆదాయపు శాఖ వెబ్ సైట్ లో పన్ను కాలిక్యులేటర్ ప్రస్తుతం యాక్టివ్‌గా ఉంది. లో లాగిన్ అయినప్పుడు క్రింది వివరాలను నమోదు చేయాలి.

  • పన్ను చెల్లింపుదారు రకం
  • పురుషుడు / స్త్రీ / సీనియర్ సిటిజన్ / సూపర్ సీనియర్ సిటిజన్
  • నివాస స్థితి
  • జీతం, ప్రత్యేక రేటు ఆదాయం కాకుండా ఇతర ఆదాయం
  • పాత, కొత్త విధానాల క్రింద మినహాయింపులు అంటే 80సీసీహెచ్(2), 80సీసీడీ(2), 80జేజేఏఏ, సెక్షన్ 57(ఐఎల్ఏ) కింద కుటుంబ పెన్షన్ మినహాయింపు
  • తగ్గింపులు/మినహాయింపులు (పైన పేర్కొన్నవి కాకుండా) కొత్త పన్ను విధానంలో వీలులేదు మీరు పై వివరాలను నమోదు చేసిన వెంటనే, పోర్టల్ పాత, కొత్త పన్ను విధానాలలోని తేడాలను చూపిస్తుంది.

ప్రాథమిక అవగాహన కోసమే..

ప్రాథమిక పన్ను గణనపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కాలిక్యులేటర్ ఉపయోగపడుతుంది. దాని ప్రధాన ఉద్దేశం కూడా అదే. దానికోసమే ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ దీనిని రూపొందించింది. ఈ లెక్కలపై చెల్లింపుదారులు పూర్తిగా ఆధారపడకూడదు. ప్రాథమిక పన్ను లెక్కింపు కోసమే దీనిని తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో రిటర్న్ లను ఫైల్ చేసేటప్పుడు సంబంధిత చట్టాలు, నియమాలను తప్పకుండా పాటించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..