AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Medal: జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీకి గోల్డ్ మెడల్.. ఎలాగంటే..

ఏళ్ల తరబడి కాలేజీలకు వెళ్ళి.. కొన్ని గంటలు లెక్చరర్లు చెప్పే పాఠాలు విన్నప్పటికీ పరీక్షలలో డీలాపడుతున్న విద్యార్దులు ఉన్న ఈ రోజుల్లో.. జైలులో ఉంటూ చదువు మీద మక్కువతో ఓపెన్ యూనివర్సిటీలో పీజీ చేసి అందులో గోల్డ్ మెడల్ సాధించారు జీవితఖైదీ పడిన వ్యక్తి. జైలు అధికారుల సాయంతో చదివి యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తీసుకున్న ఆ వ్యక్తిని అందరూ ప్రశంసిస్తున్నారు.

Gold Medal: జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీకి గోల్డ్ మెడల్.. ఎలాగంటే..
Mohammad Rafiki
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Dec 30, 2023 | 7:37 PM

Share

ఏళ్ల తరబడి కాలేజీలకు వెళ్ళి.. కొన్ని గంటలు లెక్చరర్లు చెప్పే పాఠాలు విన్నప్పటికీ పరీక్షలలో డీలాపడుతున్న విద్యార్దులు ఉన్న ఈ రోజుల్లో.. జైలులో ఉంటూ చదువు మీద మక్కువతో ఓపెన్ యూనివర్సిటీలో పీజీ చేసి అందులో గోల్డ్ మెడల్ సాధించారు జీవితఖైదీ పడిన వ్యక్తి. జైలు అధికారుల సాయంతో చదివి యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తీసుకున్న ఆ వ్యక్తిని అందరూ ప్రశంసిస్తున్నారు.

కడపజిల్లా కేంద్ర కారాగారంలో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న మహమ్మద్ రఫీ చదువులో సత్తా చాటారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో పీజీ కోర్సు చేసి ఫస్ట్ ర్యాంక్‌ కొట్టారు. అంతేకాదు యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ కూడా అందుకున్నారు. ఇది వింటుంటే మనకు జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెం.1 మూవీ గుర్తోస్తుంది కదా. అచ్చం రీల్ కథను రీయల్‌ చేసి చూపించాడు నంద్యాలకు చెందని మహమ్మద్ రఫీ అనే వ్యక్తి.

ఎన్టీఆర్ సినిమాలో హత్య కేసులో జైలుకు వెళ్లి తన తండ్రి ఆశయాన్ని నెరవర్చాలని తన తండ్రి కొరిక మేరకు జైలులో ఖైదీగా ఉంటూనే లా పట్టా పొందుతాడు హీరో. ఇప్పుడు అచ్చం అలానే మహమ్మద్ రఫీ కూడా చేసి చూపించాడు. నంద్యాల జిల్లా సంజామల మండలం సోములకు చెందిన మాబుసా, మాబుని దంపతుల రెండో కుమారుడైన మహమ్మద్ రఫీపై ఓ కేసులో నేరారోపణ రుజువైంది. దీంతో కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం అతను జైలు జీవితం అనుభవిస్తున్నారు. కానీ తనకు ఇష్టమైన చదువును కొనసాగించాలని భావించారు.

ఇవి కూడా చదవండి

కడప సెంట్రల్ జైలు అధికారుల సహకారంతో తాను అనుకున్నది సాధించాడు. హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి దూరవిద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అత్యధిక మార్కులు సాధించి బంగారు పతకం సాధించారు. ఈ నెల 28న విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సులర్ జగదీష్ నుంచి పతకాన్ని అందుకుని ఈనెల 30న కడపకు చేరుకున్నారు. ఈ మేరకు బెయిల్‌పై వచ్చి గోల్డ్ మెడల్ అందుకున్న రఫీ.. తిరిగి కడప సెంట్రల్ జైలుకు వెళ్లారు. కాగా జైలు జీవితంతో కృంగిపోకుండా అనుకున్నది సాధించిన మహమ్మద్ రఫీపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్