Visakha: చదువు కోసం వచ్చిన చిన్నారి పట్ల అసభ్య ప్రవర్తన.. ట్యూషన్ మాస్టారుకు పాతికేళ్ల జైలు..

పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. పదహారేళ్ల బాలిక టెన్త్ చదువుతోంది. ఆమెకు అక్కయ్యపాలెం లోని ట్యూషన్ సెంటర్లో చేర్పించారు. విద్యాబుద్ధులు నేర్చుకునేందుకు రోజు ట్యూషన్ సెంటర్ కు వెళ్లేది ఆ బాలిక. అయితే.. బాలికకు ట్యూషన్ చెప్పే నిర్వాహకుడు జ్ఞానేశ్వర్ రావు కన్ను ఆ బాలికపై పడింది. వక్రబుద్ధిని బయటపెట్టి.. ఆ బాలికను అసభ్యకరంగా తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడేవాడు.

Visakha: చదువు కోసం వచ్చిన చిన్నారి పట్ల అసభ్య ప్రవర్తన.. ట్యూషన్ మాస్టారుకు పాతికేళ్ల జైలు..
Andhra Pradesh
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Surya Kala

Updated on: Dec 30, 2023 | 1:05 PM

ఆయన ఓ ట్యూషన్ సెంటర్ నిర్వాహకుడు. పిల్లలకు పాఠాలు కూడా చెప్పేవాడు. అంతవరకు బాగానే ఉన్నా విద్యాబుద్ధులు నేర్పించాల్సిన అతగాడు వక్రబుద్ధిని బయటపెట్టాడు. తన దగ్గర ట్యూషన్ కోసం వచ్చిన విద్యార్థినిపై కన్నేసాడు.. ఆమెను లైంగికంగా వేధిస్తూ.. విషయం బయట చెప్పొద్దంటూ బెదిరించేవాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు.. కేసు నమోదు చేసి.. అతను అరెస్ట్ చేసి.. కోర్టులో చార్జి సీటు ఫైల్ చేశారు. సాక్షాధారాలను పరిశీలించిన న్యాయస్థానం..

పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. పదహారేళ్ల బాలిక టెన్త్ చదువుతోంది. ఆమెకు అక్కయ్యపాలెం లోని ట్యూషన్ సెంటర్లో చేర్పించారు. విద్యాబుద్ధులు నేర్చుకునేందుకు రోజు ట్యూషన్ సెంటర్ కు వెళ్లేది ఆ బాలిక. అయితే.. బాలికకు ట్యూషన్ చెప్పే నిర్వాహకుడు జ్ఞానేశ్వర్ రావు కన్ను ఆ బాలికపై పడింది. వక్రబుద్ధిని బయటపెట్టి.. ఆ బాలికను అసభ్యకరంగా తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. విద్యార్థులంతా బయటకు వెళ్లాక ఆ బాలికను ఉండమని చెప్పి లైంగికంగా వేధించేవాడు. ఆమె ఫోటోలు తీసి.. ఎవరికీ చెప్పొద్దని బెదిరించేవాడు. వాడు చేష్టలతో విసిగి తీవ్ర ఆవేదనకు గురైన ఆ బాలిక.. చివరకు జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పింది. అవాక్కైన కుటుంబ సభ్యులు.. ఫోర్త్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు.

ఫిబ్రవరి 27 2020లో.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పొక్సో కేసు సెక్షలను నమోదు చేసి విచారణ చేశారు. పూర్తి ఆధారాలను సేకరించి కోర్టుకు సమర్పించారు పోలీసులు. చార్జ్ షీట్ ను ధాఖలు చేశారు. పోక్సో స్పెషలా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ ఈ కేసును వాదించారు. సాక్షాధారాలను పరిశీలించిన న్యాయస్థానం.. ట్యూషన్ సెంటర్ నిర్వాహకుడైన నిందితుడికి శిక్ష ఖరారు చేసింది.

ఇవి కూడా చదవండి

ట్యూషన్ మాస్టర్ జ్ఞానేశ్వరరావుకు 25 ఏళ్ల జైలు శిక్షతో పాటు.. 50 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది కోర్టు. దాంతోపాటు బాధితురాలికి నాలుగున్నార లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. నిందితుడికి శిక్ష పడి బాధితురాలికి న్యాయం జరిగేందుకు పనిచేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ సహా ఇన్వెస్టిగేషన్ బాధ్యతలు చూసిన పోలీస్ అధికారులను సిపి రవిశంకర్ అయ్యనార్ అభినందించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..