Hindu Temple: ఆ ముస్లిం దేశంలో అక్షయ్ కుమార్, సంజయ్ దత్ సహకారంతో హిందూ ఆలయం నిర్మాణం.. ప్రారంభించనున్న ప్రధాని మోడీ
ఈ హిందూ ఆలయం అబుదాబిలో మొట్టమొదటిది. ఈ ఆలయం 55,000 చదరపు మీటర్లలో నిర్మించబడింది. భారతీయ కళాకారులతో అందంగా నిర్మిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణంలో 50,000కు పైగా ఇటుకలను ఉపయోగించారు. విశేషమేమిటంటే ఈ ఆలయ నిర్మాణంలో భారతదేశంలోని ప్రముఖ నటులు సంజయ్ దత్, అక్షయ్ కుమార్ కూడా సహకరించారు.
ఓ వైపు భారత దేశంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట ఏర్పాట్లకు సన్నాహాలు జరుగుతున్నాయి. దేశ విదేశాల నుంచి వేలాది మంది అయోధ్యకు చేరుకుంటున్నారు. ప్రధాని మోడీ ఆ చారిత్రాత్మక ఘట్టంలో ప్రధాన భూమికను పోషించనున్నారు. అదే సమయంలో అయోధ్యకు 2800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముస్లిం దేశంలో భారీ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయాన్ని కూడా ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఆ ముస్లిం దేశం అబుదాబి. ఇక్కడ నిర్మించిన BAPS హిందూ దేవాలయం గురించి ఈ రోజు తెలుసుకుందాం.. ఈ ఆలయాన్ని ఫిబ్రవరిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.
అబుదాబిలో మొదటి హిందూ దేవాలయం
భారతదేశానికి దాదాపు 2800 కిలోమీటర్ల దూరంలోని అబుదాబిలో నిర్మిస్తున్న మొట్ట మొదటి హిందూ దేవాలయం.. ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఈ ఆలయం భారతదేశం ఆధ్యాత్మికత, సనాతన సంప్రదాయానికి కేంద్రంగా మాత్రమే కాకుండా.. ఈ ఆలయ నిర్మాణం కారణంగా రెండు దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడి జరుగుతుంది. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయి.
ఈ హిందూ ఆలయం అబుదాబిలో మొట్టమొదటిది. ఈ ఆలయం 55,000 చదరపు మీటర్లలో నిర్మించబడింది. భారతీయ కళాకారులతో అందంగా నిర్మిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణంలో 50,000కు పైగా ఇటుకలను ఉపయోగించారు. విశేషమేమిటంటే ఈ ఆలయ నిర్మాణంలో భారతదేశంలోని ప్రముఖ నటులు సంజయ్ దత్, అక్షయ్ కుమార్ కూడా సహకరించారు.
ఈ ఆలయాన్ని స్వామినారాయణ సంస్థ (BAPS) నిర్మించింది. ఈ సంస్థ దేశ విదేశాల్లో ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయం సహా 1,100 కంటే ఎక్కువ దేవాలయాలను నిర్మించింది.
ఆలయ విశిష్టత ఏమిటి?
ఈ భారీ ఆలయాన్ని నిర్మాణంలో భారత దేశంలోని వేద వాస్తు శిల్పం ఉపయోగించబడింది, ఈ ఆలయంలో ఉంచబడిన దేవతలు, దేవతల విగ్రహాలు భారతదేశంలో తయారు చేయబడ్డాయి. అలాగే ఇందులో క్లిష్టమైన చెక్కడాలు, పాలరాతి రాళ్లను ఉపయోగించారు. ఈ దేవాలయం ఎత్తు దాదాపు 108 అడుగులు కాగా ఇందులో 180 వేల క్యూబిక్ మీటర్ల బుల్లా రాళ్లను ఏర్పాటు చేశారు. ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు రూ.700 కోట్లు ఖర్చు చేశారు.
అబుదాబిలోని ఈ విలాసవంతమైన ఆలయం ఏడు శిఖరాలను కలిగి ఉంటుంది. వీటిలో ప్రతి శిఖరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయంలో ఎగ్జిబిషన్ సెంటర్, తరగతి గదులు, ఆట స్థలం కూడా ఉన్నాయి. ఈ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం 10 ఫిబ్రవరి 2025న ప్రారంభం కానుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..