AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: రూ. 100 కోసం కక్కుర్తిపడ్డాడు.. కట్ చేస్తే.. సీన్ చిరిగి సితారయ్యింది.!

దొంగలు స్టైల్ మార్చేశారు. క్రియేటివిటీకి పదునుపెట్టి.. అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఇటీవల అనంతపురంలో చోటు చేసుకుంది. గుత్తిలో ఓ రైతును టార్గెట్‌ చేసి.. సినీ ఫక్కీలో ఏకంగా రూ. 1.60 లక్షలు ఎత్తుకెళ్లారు.

AP News: రూ. 100 కోసం కక్కుర్తిపడ్డాడు.. కట్ చేస్తే.. సీన్ చిరిగి సితారయ్యింది.!
Representative Image
Ravi Kiran
|

Updated on: Dec 30, 2023 | 12:39 PM

Share

దొంగలు స్టైల్ మార్చేశారు. క్రియేటివిటీకి పదునుపెట్టి.. అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఇటీవల అనంతపురంలో చోటు చేసుకుంది. గుత్తిలో ఓ రైతును టార్గెట్‌ చేసి.. సినీ ఫక్కీలో ఏకంగా రూ. 1.60 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన గుత్తి బస్టాండ్ సమీపంలోని ఓ ఎరువుల షాప్ దగ్గర జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం మాలిళ్లపల్లి గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే రైతు తన అవసరాల కోసం బంగారు నగలను స్థానిక బ్యాంక్‌లో తనఖా పెట్టి.. రూ. 1.60 లక్షలు తీసుకున్నాడు. ఈ మొత్తాన్ని ఓ బ్యాగ్‌లో ఉంచి.. తన బైక్‌కి తగిలించాడు. దీన్నంటిని బ్యాంక్ సమీపం నుంచి రెక్కీ నిర్వహించారు గుర్తుతెలియని దుండగులు. డబ్బులు తీసుకుని ఇంటికి బయల్దేరిన రైతును ఫాలో అయ్యారు. కొద్దిదూరం వెళ్లాక ఓ ఎరువుల షాప్ దగ్గర ఆగాడు సదరు రైతు.

ఇక అక్కడికి రెండు బైకులపై వచ్చిన ఇద్దరు దుండగులు.. రైతు బైక్ వద్ద రూ. 100 పడేసి.. ఆ రైతుకు డబ్బులు పడిపోయాయని చెప్పి.. అతడి దృష్టి మళ్లించారు. రైతు ఆ రూ. 100 తీసుకునే క్రమంలో.. దుండగులు అతడి బైక్‌కి ఉన్న రూ. 1.60 లక్షల బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. పాపం రైతు.! తిరిగి చూసుకునేలోపే.. అక్కడి నుంచి పారిపోయారు. దీంతో తాను మోసపోయాయని గ్రహించిన రైతు ఇక చేసేదేమి లేక పోలీసులను ఆశ్రయించాడు. అతడిచ్చిన కంప్లయింట్ ప్రకారం.. కేసు నమోదు చేసిన ఖాకీలు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..