Audio Goes Viral: మండపేటలో ఫ్లెక్సీల వివాదం.. వైసీపీ కార్యకర్తకు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వార్నింగ్.. ఆడియో టేప్ కలకలం

తూర్పు గోదావరి జిల్లాలో ఫ్లెక్సీల వివాదం రేగింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్లెక్సీల వల్ల ప్రజలకు ఇబ్బందులంటూ వాట్సాప్ మెసేజ్‌లు వైరల్ అవుతున్నాయి.

Audio Goes Viral: మండపేటలో ఫ్లెక్సీల వివాదం.. వైసీపీ కార్యకర్తకు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వార్నింగ్.. ఆడియో టేప్ కలకలం
Audio Goes Viral
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 06, 2021 | 10:31 AM

MLC Thota Trimurthulu Threatening YCP Worker: తూర్పు గోదావరి జిల్లాలో ఫ్లెక్సీల వివాదం రేగింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్లెక్సీల వల్ల ప్రజలకు ఇబ్బందులంటూ వాట్సాప్ మెసేజ్‌లు వైరల్ అవుతున్నాయి. ఫ్లెక్సీలపై వైసీపీ నేత వీర్రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేసి వాట్సాప్ మెసేజ్‌లు పెడుతున్నారంటూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో తోట త్రిమూర్తులు బెదిరించిన ఫోన్ కాల్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాళ్లూ చేతులు తీసేస్తా అని చెప్పు వాడికి.. అంటూ MLC తోట త్రిమూర్తులు ఫోన్‌కాల్‌లో చేసిన కామెంటే ఈ వివాదానికి కారణం. మండపేటలోని అనేక సెంటర్లలో తోట త్రిమూర్తులు ఫ్లెక్సీలు ప్రమాదకరంగా ఉన్నాయని వీర్రెడ్డి అనే ఓ కార్యకర్త వాట్సాప్ లో గ్రూప్ చాట్ చేశాడు. తీసేయండి ప్లీజ్ అంటూ చెప్పినా పెద్దగా రెస్పాన్స్ లేకపోవడంతో అదే విషయాన్ని మున్సిపల్ కమిషనర్‌కీ ఫిర్యాదు చేశాడు. ఈ విషయం కాస్తా.. MLC తోటకు తెలిసింది. దానిపై సీరియస్ అయిన తోట.. పట్టణంలోని ఏడో వార్డ్ కౌన్సిలర్‌కి చెప్పి.. వీర్రెడ్డి ఏంటీ ఇలా మాట్లాడుతున్నాడు. కాళ్లూ చేతులు తీసేస్తా అని చెప్పువాడికి అంటూ వార్నింగ్ ఇప్పించే ప్రయత్నం చేశారు.

ఫిర్యాదు చేసిన వీర్రెడ్డి గురించి ఏడో వార్డ్‌ కౌన్సిలర్‌తో తోట త్రిమూర్తులు మాట్లాడిన మాటలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. రోడ్డు మీద ఫ్లెక్సీలు అడ్డంగా ఉన్నాయని అభ్యంతరం చెబితే కాళ్లూ చేతులూ తీసేస్తాం అని బెదిరిస్తారా? ఇదెక్కడి అన్యాయం అంటూ భయంతో వణికిపోతున్నాడు వైసీపీ కార్యకర్త. ఈ ఆడియో బయటకు వచ్చిందో లేదో.. ఫ్లెక్సీలు తీయించండి అంటూ ఫిర్యాదు చేసిన వీర్రెడ్డి ప్రాణహాని ఉందంటున్నాడు. రక్షణ కోసం స్థానిక పోలీసులను ఆశ్రయిస్తానంటున్నాడు

ఈ ఆడియో ఏంటి.. మీరెందుకు ఇలా బెదిరించారని.. తోటను టీవీ9 అడిగింది. ఆ వెర్షన్‌ను కూడా తెలుసుకునే ప్రయత్నం చేసింది. అయితే, ఆ ఆడియో.. పార్టీ పరంగా ఏదో క్యాజువల్‌గా మాట్లాడిన వాటిని రికార్డ్ చేసి రచ్చ చేస్తున్నారు తప్ప తాను ఎవర్నీ బెదిరించడం లేదంటున్నారు.

Read Also…  ఐటీ అధికారులకు పార్లమెంటరీ కమిటీ సమన్లు…ఐటీ రూల్స్ పై విస్తృత చర్చ

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!