AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Employees: కోవిడ్‌ బారిన పడిన ఏపీ ఉద్యోగులకు 20 రోజుల ప్రత్యేక సాధారణ సెలవులు.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు

AP Employees: ఏపీ ప్రభుత్వం కోవిడ్‌ బాధిత ఉద్యోగుల పట్ల కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ బారిన పడిన ప్రభుత్వ ఉద్యోగులకు 20 రోజుల పాటు ప్రత్యేక సాధారణ సెలవులు..

AP Employees: కోవిడ్‌ బారిన పడిన ఏపీ ఉద్యోగులకు 20 రోజుల ప్రత్యేక సాధారణ సెలవులు.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
Subhash Goud
| Edited By: |

Updated on: Jul 06, 2021 | 1:08 PM

Share

AP Employees: ఏపీ ప్రభుత్వం కోవిడ్‌ బాధిత ఉద్యోగుల పట్ల కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ బారిన పడిన ప్రభుత్వ ఉద్యోగులకు 20 రోజుల పాటు ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులు 2020 మార్చి25వ తేదీ నుంచి వర్తిస్తాయని వెల్లడించింది. మొత్తం 5 కేటగిరీలుగా విభజించి సెలవులు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉద్యోగి కరోనా బారిన పడి హోం ఐసోలేషన్‌లో ఉంటే 20 రోజుల వరకూ కమ్యూటెడ్‌ సెలవు ఇస్తారు. ఒకవేళ కమ్యూటెడ్‌ సెలవలు అందుబాటులో లేకుంటే 15 రోజుల ప్రత్యేక సాధారణ సెలవు ఇస్తారు. ఇక మిగతా ఐదు రోజుల్ని ఈఎల్‌, హెచ్‌పీఎల్‌ నుంచి సర్దుబాటు చేయనున్నట్లు తెలిపింది.

ఉద్యోగి కోవిడ్‌ బారినపడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటే… పాజిటివ్‌ వచ్చిన నాటి నుంచి 20 రోజుల పాటు సెలవు మంజూరు చేస్తారు. అయితే ఉద్యోగిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు లేదా కలిసి ఉంటున్న వారికి పాజిటివ్‌ వస్తే.. 15 రోజుల ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేస్తారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి ఉద్యోగి కాంటాక్టు అయి ఉండి హోమ్‌ క్వారంటైన్‌లో ఉంటే.. ఏడు రోజుల పాటు వర్క్‌ ఫ్రం హోమ్‌గా పరిగణిస్తారు. కంటెయిన్‌మెంట్‌ జోన్‌ పరిధిలో ఉండి క్వారంటైన్‌లో ఉంటే.. కంటెయిన్‌మెంట్‌ జోన్‌ డీ నోటిఫై చేసే వరకూ ఉద్యోగి ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నట్లు పరిగణిస్తారు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

కాగా, ప్రస్తుతం ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలు, నైట్‌కర్ఫ్యూ తదితర చర్యల కారణంగా రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. అలాగే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఏపీ రాష్ట్రంలో19,05,023 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 12,870 మంది మృతి చెందారు. రాష్ట్రంలో 33,964 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇవీ కూడా చదవండి

Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. గణేష్‌ చతుర్థికి ప్రత్యేక రైళ్లు: సెంట్రల్‌ రైల్వే

Bone death: కరోనా బాధితుల్లో మరో కొత్త సమస్య.. ఇప్పటి వరకు ముగ్గురిలో గుర్తించామన్న వైద్య నిపుణులు

ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!