Payyavula Kesav: మత వ్యవస్థలపై ప్రభుత్వ పెత్తనం మంచిది కాదు.. తిరుమలలో పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్
మత వ్యవస్థలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడం సబబు కాదని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ చైర్మన్, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.
AP PAC Chairman Payyavula Kesav: మత వ్యవస్థలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడం సబబు కాదని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ చైర్మన్, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. మతంలో ప్రభుత్వ జోక్యం అనవసరమన్నారు. మత వ్యవస్థల పనితీరు సమీక్షించుకోవడానికి మార్గదర్శకాలు ఇవ్వచ్చన్నారు. మతాల మీద పెత్తనానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేయడం సరైందన్నారు. సనాతన ధర్మం వేల సంవత్సరాలుగా అనేక దాడులు ఎదుర్కొంటూ సజీవంగా నిలబడిందని పయ్యావుల పేర్కొన్నారు.
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని పయ్యావుల కేశవ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయంలో సాధారణ భక్తులతో కలిసి క్యూలో వెళ్లారు. అనంతరం వెంగమాంబ అన్నప్రసాద నిలయంలో అన్నప్రసాద తయారీ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడే భక్తులతో కలిసి పయ్యావుల కుటుంబ సభ్యులు భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీటీడీని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పరిధిలోకి తేవాలని పాలకమండలి తీర్మానం చేసిందన్న ఆయన.. ఇందుకు గవర్నర్ కాగ్‌కు ఆమోదం తెలపాల్సిన ఉందన్నారు. టీటీడీ స్వంయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఉండాలనేది 100 కోట్ల మంది హిందువుల ఆకాంక్ష అన్న ఆయన.. ఎన్టీఆర్ హయంలో తిరుమలను మరో వాటికన్ సిటీలా చేసి టీటీడీకి స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు కృషి చేశారని గుర్తు చేశారు.