Kotamreddy Sridhar Reddy: రక్షణ కల్పించండి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి లేఖ..
ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హీట్ దేశరాజధాని ఢిల్లీకి చేరింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ చేపట్టాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హీట్ దేశరాజధాని ఢిల్లీకి చేరింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ చేపట్టాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖ రాశారు. తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కల్గించారన్న ఎమ్మెల్యే.. నిజానిజాలు తేల్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సైతం కేంద్రాన్ని కోరాలంటూ డిమాండ్ చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై చేసిన ట్యాపింగ్ వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఏపీలో రాజకీయాలు మరింత హీటెక్కాయి. ఈ క్రమంలో కోటంరెడ్డి అమిత్ షాకు లేఖ రాయడం సంచలనంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ జరిపించడంతోపాటు.. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కేంద్ర హోంమంత్రిని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు.
తాను ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన తర్వాత తనను నెల్లూరు ఇన్ చార్జ్‌గా తప్పించారని.. ఆ తర్వాత నుంచి తనకు సంఘవిద్రోహశక్తుల నుంచి అనేక బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కోటంరెడ్డి తెలిపారు. తనపై అక్రమ కేసులు కూడా బనాయిస్తున్నారన్నారు. తనతోపాటు తన కేడర్, మద్దతుదార్లకు కూడా ప్రాణ హాని ఉందని అమిత్ షాకు రాసిన లేఖలో కోటంరెడ్డి తెలిపారు. తన వ్యక్తిగత అంశాలను సైతం ఫోన్ ట్యాపింగ్ ద్వారా విన్నారని.. తన స్వేచ్ఛకు భంగం కలిగేలా.. వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. కేంద్రానికి లేఖ రాశానంటూ కోటం రెడ్డి పేర్కొన్నారు. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కూడా కలిసి ఫిర్యాదు చేస్తాన్నారు.
కాగా.. ఎమ్మెల్యేగా నాలుగేళ్లుగా రూరల్ సమస్యలపై అనేక సార్లుగా మాట్లాడుతూనే ఉన్నానని.. ముఖ్యమంత్రి జగన్ అనేక సమస్యలపై సంతకాలు కూడా చేశారని కానీ పనులు మాత్రం జరగడం లేదని కోటంరెడ్డి తెలిపారు. నియోజక వర్గ సమస్యలపై ఈ నెల 17న కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించారు. నియోజక వర్గంలో రోడ్లు పూర్తి చేయాలని అనేక సార్లు విజ్ఞప్తి చేసినా.. పూర్తి కానందున 25న రోడ్లు, భవనాల శాఖ ఆఫీస్ ముందు ధర్నాకు దిగబోతున్నట్లు ప్రకటించారు.
సంప్రదాయ వేడుక రొట్టెల పండుగ నిర్వహించే చోట దర్గా నిర్మాణం పూర్తి చేయాలని సీఎం జగన్ స్వయంగా చెప్పినా.. అధికారులు బిల్లులు క్లియర్ చేయడం లేదని కోటంరెడ్డి ఆరోపించారు. ఎన్ని రోజులు ఆఫీసుల చుట్టూ తిరిగినా పనులు పూర్తి కావడం లేదన్న ఎమ్మెల్యే.. తన కడుపు మంటకు ఇది కూడా కారణమని తెలిపారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..