Viral Video: మిడ్ డే మీల్స్‌లో చిన్నారులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే..
దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. తన నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండేది. అయితే మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇక్కడ మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న నేత. అలాంటి కంచుకోటను ఢీ కొట్టి దెందులూరులో వైసీపీ జెండా ఎగరవేసిన ఘనత ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికే దక్కింది. మరొకసారి దెందులూరులో వైసీపీ జెండా ఎగరేయాలని దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు ఎమ్మెల్యే.

ఏలూరు, జనవరి 23: దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. తన నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండేది. అయితే మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇక్కడ మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న నేత. అలాంటి కంచుకోటను ఢీ కొట్టి దెందులూరులో వైసీపీ జెండా ఎగరవేసిన ఘనత ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికే దక్కింది. మరొకసారి దెందులూరులో వైసీపీ జెండా ఎగరేయాలని దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు ఎమ్మెల్యే. గడిచిన నాలుగున్నర సంవత్సరాల పాలనలో ప్రభుత్వం నుంచి నియోజకవర్గ ప్రజలకు అందిన ప్రయోజనాలు తెలుపుతూ.. ఇంకా ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకునే క్రమంలో ప్రతిష్టాత్మకంగా ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టారు. యాత్రలో భాగంగా మూడవ విడత 29 గ్రామాల్లో సుమారు 10 రోజులపాటు 200 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పాదయాత్ర కొత్త ముప్పర్రు గ్రామానికి చేరుకుంది. అయితే మధ్యాహ్న భోజన విరామ సమయానికి అయినా కొత్త ముప్పర్రులోని ప్రాథమిక పాఠశాలకు చేరుకొని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
తాను ఎమ్మెల్యే అనే గర్వం లేకుండా.. చిన్నారులతో ముచ్చటిస్తూ పాఠశాలలో జరిగిన అభివృద్ధి పనులు వారి ద్వారానే తెలుసుకున్నారు. వారితో కలిసి నేలపై కూర్చుని మధ్యాహ్న భోజనం పథకంలో విద్యార్థులకు ప్రభుత్వం అందించే భోజనం చేశారు. మెనూ ప్రకారం వండిన కిచిడి ఉడకబెట్టిన ఎగ్‌ను నిర్వాహకులు ఎమ్మెల్యేకు వడ్డించారు. దాంతో పార్టీ శ్రేణులు, గ్రామస్తులు మరొకసారి ఎమ్మెల్యే సింపుల్ సిటీ పట్ల ప్రశంశలతో ముంచిత్తుతున్నారు. ఆ పాఠశాల విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు తమ చిన్నారులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారని సంబరపడిపోతున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరితో పాటు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, దెందులూరు నియోజకవర్గ వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




