AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YSRCP: వైసీపీకి మరో ఎంపీ రాజీనామా.. అసలు కారణం ఇదేనంటున్న పార్టీ వర్గాలు..

వైసీపీకి ఏమైంది. నేతలు ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం చూశాం. కానీ తాజాగా నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈసారి ఆయనను నరసరావుపేట నుండి కాకుండా గుంటూరు నుండి పోటీ చేయాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది.

YSRCP: వైసీపీకి మరో ఎంపీ రాజీనామా.. అసలు కారణం ఇదేనంటున్న పార్టీ వర్గాలు..
Ycp Mp Lavu Krishnadevaraya
Srikar T
|

Updated on: Jan 23, 2024 | 1:50 PM

Share

గుంటూరు, జనవరి 23: వైసీపీకి ఏమైంది. నేతలు ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం చూశాం. కానీ తాజాగా నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈసారి ఆయనను నరసరావుపేట నుండి కాకుండా గుంటూరు నుండి పోటీ చేయాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది. ఎంపీ కృష్ణదేవరాయలు మాత్రం నరసరావుపేట నుండే పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నారు. కానీ, గుంటూరు నుండి లావు కృష్ణ దేవరాయలు పోటీ చేయాలని పార్టీ నాయకత్వం కోరుతుందనే ప్రచారం సాగుతుంది.

అయితే ఈ విషయమై తన అభిప్రాయాన్ని లావు కృష్ణ దేవరాయలు పార్టీ నాయకత్వానికి తేల్చి చెప్పారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. నరసరావుపేట పార్లమెంట్ స్థానంలో తాను చేయాల్సిన పనులు ఇంకా మిగిలి ఉన్నాయని అందుకే ఈసారి కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం పట్టించుకోని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్ వైఎస్ఆర్‌సీపీకి గుడ్ బై చెప్పారు. మచిలీపట్టణం ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా రాజీనామా చేశారు. బాలశౌరి జనసేనలో కండువా కప్పుకోనున్నారు. తాజాగా నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేశారు.

ఈసారి ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్న నేపథ్యంలో నరసరావు పేట ఎంపీ స్థానం నుండి బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధిని బరిలోకి దింపాలని వైసీపీ భావిస్తుంది. అందుకే ఎంపీ లావు కృష్ణదేవరాయలును గుంటూరుకు మార్చాలని ప్రతిపాదించింది వైసీపీ అధిష్టానం. ఇదిలా ఉంటే ఎంపీ కృష్ణదేవరాలయలు సంబంధించి మరో అంశం తెరపైకి వచ్చింది. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నలుగురు ఎమ్మెల్యేలను కూడా కృష్ణదేవరాయలుతో పాటే కొనసాగించాలని పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు పలువురు శాశనసభ్యులు. గుంటూరు ఎంపీ స్థానం నుండి పోటీకి లావు కృష్ణ దేవరాయలు సానుకూలంగా లేరు.

ఇవి కూడా చదవండి

నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని తన అభిప్రాయాన్ని అధిష్టానానికి లావు కృష్ణదేవరాయలు గతంలో తెలిపినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఈ విషయంపై పార్టీ నాయకత్వం నుండి సానుకూల స్పందన రాని కారణంగానే లావు కృష్ణ దేవరాయలు రాజీనామా నిర్ణయం తీసుకున్నారనే చర్చ సాగుతుంది. తెలుగు దేశం పార్టీలో లావు కృష్ణ దేవరాయలు చేరుతారా అని మీడియా ప్రతినిధులు ఇవాళ ఆయనను ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైఎస్ఆర్‌సీపీ వ్యూహారచన చేస్తుంది. ఈ క్రమంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆ పార్టీ మారుస్తుంది. ఈ క్రమంలోనే టిక్కెట్లు దక్కని అసంతృప్తులు పార్టీని వీడుతున్నారని చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..