AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఎన్నికల షెడ్యూల్‌కు కౌంట్‌డౌన్ మొదలు.. స్పీడ్ పెంచిన పార్టీలు.. ఫిబ్రవరి మూడో వారంలో.?

మందిరం అయిపోయింది.. ఇక యావత్‌ దేశం ఎన్నికల మూడ్‌లోకి వచ్చేసింది. ఏపీలో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలూ ఉండడంతో ఆ హీట్‌ మరింతగా కనిపిస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 3 వారాల తర్వాత ఏక్షణమైనా ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే ఛాన్స్‌ ఉంది.

AP News: ఎన్నికల షెడ్యూల్‌కు కౌంట్‌డౌన్ మొదలు.. స్పీడ్ పెంచిన పార్టీలు.. ఫిబ్రవరి మూడో వారంలో.?
Ap Politics
Ravi Kiran
|

Updated on: Jan 23, 2024 | 10:30 AM

Share

మందిరం అయిపోయింది.. ఇక యావత్‌ దేశం ఎన్నికల మూడ్‌లోకి వచ్చేసింది. ఏపీలో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలూ ఉండడంతో ఆ హీట్‌ మరింతగా కనిపిస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 3 వారాల తర్వాత ఏక్షణమైనా ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే ఛాన్స్‌ ఉంది. ఈసీ ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో సమీక్షలు పూర్తి చేసి.. షెడ్యూల్‌పై కసరత్తు చేస్తోంది. సంక్రాంతికి ముందు నుంచే అభ్యర్థుల ఖరారుపై దృష్టి పెట్టిన ఏపీ సీఎం వైఎస్ జగన్‌.. ఇప్పుడు 5వ లిస్ట్‌పై కసరత్తు చేస్తున్నారు. రెండ్రోజుల్లో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఫైనల్‌ లిస్ట్‌ ఖరారు అవుతుందని సమాచారం. మరోవైపు సీట్ల సర్దుబాటుకు ముందే టీడీపీ-జనసేనలో విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది. తిరుపతి, మండపేట సహా 15 నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన పార్టీలకు మిత్రభేధం అడ్డుపడుతోంది. ఆయా పార్టీలకు.. పార్టీ మారుతున్న నేతలతో సర్దుబాట్లు తలనొప్పిగా మారాయి. గురజాల, మచిలీపట్నం, గుంటూరు సహా కొన్ని స్థానాల్లో టీడీపీ-జనసేన పార్టీలు ఇదే పరేషాన్ ఎదుర్కుంటున్నాయి.

ఇదిలా ఉంటే.. తిరుపతి నియోజకవర్గం విషయంలో టీడీపీ-జనసేన కూటమి మధ్య భిన్నాభిప్రాయం తలెత్తింది. తిరుపతిలో జనసేననే పోటీ చేస్తుందని ఆ పార్టీ, తిరుపతి సీటు సెంటిమెంట్ అంటూ టీడీపీ ఎవరి వెర్షన్ వారు వినిపిస్తున్నారు. మరోవైపు కొణిదెల ఫ్యామిలీ పోటీపై జనసేన, కాంగ్రెస్ పార్టీలపై కేడర్ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. తిరుపతి నుంచి పవన్ పోటీ చేయాలని జనసేన క్యాడర్ కోరుకుంటుంది. కాంగ్రెస్ నుంచి చిరంజీవి బరిలో దిగాలని మాజీ ఎంపీ చింతామోహన్ పదే పదే చెప్తున్నారు. జనసేన నుంచి ఇద్దరు, టీడీపీ నుంచి ఏడుగురు ఆశావాహులు పోటీ పడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తిరుపతి రాజకీయం ఆసక్తికరంగా మారింది. రెండు పార్టీల మధ్య మిత్రభేదం స్పష్టంగా కనిపిస్తోంది.

Follow Us
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే