Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Roja: కొండలపై భవనాలు కట్టకూడదనడం పవన్ అజ్ఞానం.. మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్..

వైసీపీ, జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇందుకు కారణం పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనే.. రుషికొండ దగ్గర జరుగుతున్న నిర్మాణాలపై తీవ్ర విమర్శలు చేసిన పవన్‌కు మంత్రి రోజా శనివారం కౌంటర్‌ ఇచ్చారు. పవన్ కల్యాణ్ పవర్ స్టార్ కాదని.. రీమేక్ స్టార్ అంటూ రోజా సెటైర్లు వేశారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ కోసం పవన్ కల్యాణ్ తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

Minister Roja: కొండలపై భవనాలు కట్టకూడదనడం పవన్ అజ్ఞానం.. మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్..
Minister RK Roja Counter on Pawan Kalyan
Follow us
Shaik Madar Saheb

| Edited By: Ram Naramaneni

Updated on: Aug 12, 2023 | 7:42 PM

వైసీపీ, జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇందుకు కారణం పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనే.. రుషికొండ దగ్గర జరుగుతున్న నిర్మాణాలపై తీవ్ర విమర్శలు చేసిన పవన్‌కు మంత్రి రోజా శనివారం కౌంటర్‌ ఇచ్చారు. పవన్ కల్యాణ్ పవర్ స్టార్ కాదని.. రీమేక్ స్టార్ అంటూ రోజా సెటైర్లు వేశారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ కోసం పవన్ కల్యాణ్ తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కొండలపై భవనాలు కట్టకూడదనడం పవన్ అజ్ఞానమని విమర్శించారు. మెగాస్టార్ చిరంజీవిపై మినిస్టర్ రోజా మరోసారి ఫైర్ అయ్యారు. ఇక ఇన్నాళ్లూ చిరంజీవి పెద్దమనిషిగా, బ్యాలెన్స్‌డ్‌గా ఉండే వ్యక్తి అని భావించామని, కానీ సడన్‌గా ఆయనకు ఏమైందో కానీ జగన్‌కు సలహాలు ఇస్తూ విషం చిమ్మడం ప్రారంభించారంటూ మంత్రి రోజా విరుచుకుపడ్డారు. కొండలపై భవనాలు కట్టకూడదనడం అజ్ఞానమన్న రోజా.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇల్లు బంజారాహిల్స్ కోండపైనే ఉన్నాయన్నారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ కోసం పవన్ కల్యాణ్ తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారంటూ మంత్రి రోజా ఆరోపించారు.

రుషికొండపై పవన్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ రోజా మండిపడ్డారు. ప్రభుత్వ భూముల్లో భవనాలు కడుతుంటే పవన్‌కు బాధేంటి..? విశాఖను పాలనారాజధానిగా ఎంచుకుంటే చంద్రబాబు, పవన్‌ కలిసి విషం కక్కుతున్నారంటూ మంత్రి రోజా విమర్శించారు. కొండలపై భవనాలు ఎందుకు కట్టకూడదు.. గీతం వర్సిటీ భూములపై ఎందుకు మాట్లాడడం లేదు అంటూ రోజా ఫైర్ అయ్యారు. విశాఖను దోచుకున్నది టీడీపీ నేతలేనంటూ మంత్రి రోజా పేర్కొన్నారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజ్‌ కోసమే పవన్‌ పనిచేస్తున్నారంటూ విమర్శించారు. కోర్టు నిబంధనలకు లోబడే భవన నిర్మాణాలు జరుగుతున్నాయని.. కోర్టుల కంటే పవన్‌ గొప్పవారా అంటూ మంత్రి రోజా విమర్శించారు. రుషికొండ పర్యటన పేరుతో పవన్ హడావుడి చేశారని.. సుప్రీంకోర్టు నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తిచేశారు.

అనుమతి ఇచ్చిన విస్తీర్ణం కంటే తక్కువ ఏరియాలోనే నిర్మాణాలు జరుగుతున్నాయని.. రుషికొండపై రాద్దాంతం తగదంటూ రోజా పేర్కొన్నారు. గతంలో విశాఖలో టీడీపీ నేతలు భూములు దోచుకుంటే.. ఇప్పుడు ఇన్‌ఫోసిస్‌, అదానీ డేటా సెంటర్‌, రహేజా వంటి కంపెనీలను సీఎం జగన్‌ తీసుకొచ్చారని మంత్రి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..