AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: బిగ్ అలర్ట్.. దూసుకొస్తున్న అల్పపీడనం.. వర్షాలే వర్షాలు..! వచ్చే 4 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..

కష్టాలకు ఎదురీది పంటలు సాగు చేసిన రైతులను.. అకాల వర్షాలు నట్టేట ముంచాయి. నోటి కాడి బుక్క నీటిపాలడంతో దిగులుతో తలలు పట్టుకున్నారు. ఇప్పటికే భారీగా నష్టపోయిన రైతులకు మరో హెచ్చరిక చేసింది వాతావరణ శాఖ.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతంలో మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Rain Alert: బిగ్ అలర్ట్.. దూసుకొస్తున్న అల్పపీడనం.. వర్షాలే వర్షాలు..! వచ్చే 4 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..
Ap Rain Alert
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 07, 2025 | 7:29 AM

ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఎండలు భగభగ మండుతుంటే.. మరి కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు దంచి కొడుతున్నాయి. మరో రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులే ఉంటాయని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. అకాలవర్షం ఇప్పటికే కొన్ని ప్రాంతంలోని రైతులను నిండా ముంచింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకళ్లెదుటే వర్షార్పణం అవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. భారీ వర్షలతోపాటు.. ఈదురు గాలులకు మామిడి తోటలో కాయలు రాలిపోయాయి.

ఈ క్రమంలోనే.. వాతావరణ శాఖ మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతంలో మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.. ఇది తీరానికి సమాంతరంగా కదులుతూ, బంగ్లాదేశ్‌ లేదా మయన్మార్‌ వైపు పయనిస్తుందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఎక్కువగా ఉండకపోవచ్చని, అల్పపీడనం ఏర్పడిన తర్వాత దీనిపై మరింత స్పష్టత వస్తుందని చెబుతున్నారు.. కాగా.. రాబోయే నాలుగు రోజుల్లో ఏపీలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఇవాళ అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద కాకుండా సురక్షిత ప్రాంతంలో ఆశ్రయం పొందాలని సూచించారు.

భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు..

ఇదిలాఉంటే.. ఉష్ణోగ్రతలు కూడా భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం రాయలసీమలో 40 నుంచి 42 డిగ్రీలు, ఉత్తరాంధ్రలో 39 నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్‌ తెలిపారు. ఆదివారం కర్నూలు జిల్లా కామవరంలో 40.8, ప్రకాశం పెద్దదోర్నాల 40.7°C, నంద్యాల దొర్నిపాడు 40.6°C, పల్నాడు రావిపాడు 40.5°C, శ్రీకాకుళం పొందూరు 40.3°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైందని వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..