AP New Districts: ఏపీలో త్వరలో మరో కొత్త జిల్లా.. కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి పేర్ని నాని
Minister Perni Nani: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ సర్కార్ నూతన ఆధ్యాయానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 13 జిల్లాలను సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభించారు.
Minister Perni Nani: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ సర్కార్ నూతన ఆధ్యాయానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 13 జిల్లాలను సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభించారు. దీంతోపాటు నిన్నటినుంచే అన్ని జిల్లాల్లో పాలన సైతం ప్రారంభమైంది. ఏపీలో అంతకుముందు 13 జిల్లాలు ఉండగా. మరో 13 జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ఏపీలో జిల్లాల (AP New Districts) సంఖ్య మొత్తం 26కు చేరింది. పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీ సత్యసాయి, తిరుపతి, అన్నమయ్య జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. కలెక్టర్లు, ఎస్పీలను సైతం నియమించింది. ఈ క్రమంలో మంత్రి పెర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. 26 జిల్లాలకు అదనంగా మరో జిల్లా వచ్చే అవకాశం ఉందంటూ మంత్రి పేర్ని నాని మంగళవారం పేర్కొన్నారు. గిరిజన (Tribal Areas) ప్రాంతాలన్నీ కలిపి ఒకే జిల్లాగా ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని నాని పేర్కొన్నారు.
కొత్త జిల్లా ఏర్పాటుపై సీఎం జగన్ ఆలోచన చేస్తున్నారని.. 26 జిల్లాలకు అదనంగా మరో జిల్లా వచ్చే అవకాశం ఉందని మంత్రి పేర్ని నాని అభిప్రాయపడ్డారు. త్వరలోనే గిరిజన జిల్లా ఏర్పాటుకు సీఎం సీరియస్‌గా ఆలోచిస్తున్నారని పేర్ని నాని తెలిపారు. ఇప్పుటికే గిరిజన ప్రాంతాల్లో రెండు జిల్లాలు ఏర్పాటు చేశామని.. మరో జిల్లాను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. పాలనను సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
Also Read: