Private Colleges: ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలపై మంత్రి సురేష్ ఆగ్రహం.. ఇకపై అలాంటి సహించబోమంటూ స్ట్రాంగ్ వార్నింగ్..

ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేట్ కాలేజీల వ్యవహారశైలిపై మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని..

Private Colleges: ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలపై మంత్రి సురేష్ ఆగ్రహం.. ఇకపై అలాంటి సహించబోమంటూ స్ట్రాంగ్ వార్నింగ్..
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 12, 2020 | 6:09 PM

ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేట్ కాలేజీల వ్యవహారశైలిపై మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం నాడు ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రైవేటు కాలేజీ మాజమాన్యాల దోపిడీపై ఆయన స్పందించారు. ప్రైవేటు కాలేజీల గుత్తాధిపత్యానికి కళ్లెం వేయాలని నిర్ణయించుకున్నామన్నారు. ఇప్పటి వరకు వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా నడిచిందని, ఇకపై అలా సాగదని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు మంత్రి సురేష్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వాలు కార్పొరేట్లకు పెద్దపీట వేశాయని విమర్శించిన ఆయన.. తమ ప్రభుత్వంలో అలాంటి విధానాలు ఉండవని స్పష్టం చేశారు.

ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు అధిక ఫీజులను వసూలు చేస్తే సహించేది లేదని మంత్రి తేల్చి చెప్పారు. ఇప్పటికే 400 జూనియర్ కాలేజీలను బ్లాక్ చేశామని వెల్లడించారు. 10 సంవత్సరాల నుండి అఫిలియేషన్ తీసుకుని రెన్యూవల్ చేయించుకుంటున్నారు కానీ.. ఆ కాలేజీల్లో మౌళిక సదుపాయాలు మాత్రం పెరగలేదన్నారు. చాలా కాలేజీల్లో ఫైర్ సేఫ్టీ కూడా లేదన్నారు. త్వరలోనే విద్యార్థుల కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. పారదర్శక అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్ విధానాన్ని తీసుకువచ్చామని మంత్రి సురేష్ వివరించారు. అయితే ఆన్‌లైన్‌పై కోర్టు ఆదేశాల ప్రకారం స్టే నడుస్తోందన్నారు. మౌళిక సదుపాయాలు మెరుగు పరిచేందుకు కాలేజీలకు సమయం ఇవ్వాలని వచ్చిన అభ్యర్థన మేరకు ఒక ఏడాది సమయం ఇచ్చామని, వచ్చే ఏడాది నుండి ఇలాంటివి అసలు సహించబోమని మంత్రి సురేష్ తేల్చి చెప్పారు.

Also Read:

Corona: ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న కరోనా మహమ్మారి వ్యాప్తి.. కొత్తగా 665 కేసులు నమోదు.. ముగ్గురు మృతి

తెలంగాణ కాంగ్రెస్‌లో కాకరేపిన జగ్గారెడ్డి కామెంట్లు.. తప్పుడు సమాచారం ఇస్తున్నదెవరు? వార్నింగ్ ఎవరికి?

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!