మహా పాపం..వందేళ్ల చరిత్ర గల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెకిలించిన దుండగులు..ఎందుకో తెల్సా?

కర్నూలు జిల్లాలో గుప్తనిధుల వేట కలకలం రేపింది. కొందరు దుండగులు గుప్తనిధుల కోసం ఏకంగా ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు.

మహా పాపం..వందేళ్ల చరిత్ర గల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెకిలించిన దుండగులు..ఎందుకో తెల్సా?
Follow us

|

Updated on: Dec 12, 2020 | 6:19 PM

కర్నూలు జిల్లాలో గుప్తనిధుల వేట కలకలం రేపింది. కొందరు దుండగులు గుప్తనిధుల కోసం ఏకంగా ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు. గూడూరు మండలం పొన్నకల్లులో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దుండగులు పెకలించారు.  పొన్నకల్లు గ్రామంలో వందేళ్ల చరిత్ర గల శ్రీ దాస్ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. గుప్తనిధుల కోసం గుంతలు తవ్వి విగ్రహాలను చిందరవందరగా పడేశారు. హనుమాన్‌ విగ్రహం ధ్వంసంపై హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రోడ్డుపై బైఠాయించి ఆర్‌ఎస్‌ఎస్‌, వీహెచ్‌పీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. గుళ్లపై దాడులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కాగా ఇటువంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో బాగా పెరిగాయి. గుప్త నిధులు కోసం ఎక్కడబడితే అక్కడ తవ్వకాలు చేస్తున్నారు. జంతువులతో పాటు నర బలులు ఇచ్చేందుకు సైతం వెనకాడటం లేదు. దీనిపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టని నేపథ్యంలో..దుండగులు మరింత రెచ్చిపోయే పరిస్థితి కనిపిస్తోంది.

Also Read : 

Bigg Boss 4 Telugu : బిగ్ బాస్ ఫినాలేకు అతిథి మహేశ్ కాదట..’మాస్ కా బాప్’ రాబోతున్నారట !

నెల్లూరు జిల్లా వెలుగొట్లపల్లిలో పొలంలో నాట్లు వేస్తున్న ఆరుగురు కూలీలకు అస్వస్థత..ఒకరు మృతి

మహిళకు పురిటి నొప్పులు, అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేదు : వాలంటీర్లు హీరోలు అయిన వేళ