Araku: వరుస సెలవులు.. అరకు వైపు పరుగులు..
ఏజెన్సీలో ఎక్కడ చూసినా పెద్దసంఖ్యలో పర్యాటకులే కనిపిస్తున్నారు. బొర్రా గుహల నుంచి లంబసింగి వరకు జనసందడి ఉంది. ట్రాఫిక్ సమస్య కూడా నెలకొంది. ఏజెన్సీ ప్రాంతాలకు వాహనాలు క్యూ కట్టడంతో కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయాయి. శీతాకాలం కావడంతో ప్రకృతి దృశ్యాలు మరింత కనువిందు చేస్తున్నాయి.

అరకు అందాలు కట్టి పడేస్తున్నాయి. ఆంధ్రా ఊటీగా పిలిచే అరకు సోయగాలను చూసేందుకు పర్యాటకులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో, పెద్దసంఖ్యలో తరలివచ్చారు. మంచుదుప్పట్లో ప్రకృతి అందాలు మరింత పరవశింపచేస్తున్నాయి. పాడేరు, అరకు, చింతపల్లిలో కనిష్ట ఉష్ణోగ్రతలు 9 డిగ్రీలకు పడిపోయాయి. లంబసింగి, వంజంగి, మదగడ, అరకు, చాపరాలు వంటి ప్రాంతాలకు పర్యాటకులు క్యూ కట్టారు. బొర్రా గుహలు, గిరిజన మ్యూజియం, చాపరాయి జలపాతాలు, పూదోటల అందాలు కనువిందు చేస్తున్నాయి.
అరకు అంటేనే ప్రకృతి అందాలకు పుట్టినిల్లు. కూల్ క్లైమేట్ సందర్శకులను ఆహ్వానిస్తోంది. కొండలు, ఘాట్ రోడ్ పై పొగమంచుతో ప్రకృతి అందాలు మరింత సుందరంగా మారాయి. దీంతో సందర్శకులు అరకుకు పెద్దసంఖ్యలో క్యూ కడుతున్నారు. అయితే అరకు వచ్చే వారి సంఖ్య విపరీతంగా ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. రద్దీకి తగ్గట్టు రూంలు అందుబాటులో లేవు. దీంతో కుటుంబంతో తరలివచ్చిన వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఒక్కో రూంకు 6 నుంచి 8వేల వరకు వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏజెన్సీలో ఎక్కడ చూసినా పెద్దసంఖ్యలో పర్యాటకులే కనిపిస్తున్నారు. బొర్రా గుహల నుంచి లంబసింగి వరకు జనసందడి ఉంది. ట్రాఫిక్ సమస్య కూడా నెలకొంది. ఏజెన్సీ ప్రాంతాలకు వాహనాలు క్యూ కట్టడంతో కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయాయి. శీతాకాలం కావడంతో ప్రకృతి దృశ్యాలు మరింత కనువిందు చేస్తున్నాయి. వంజంగి కొండపై పాలసముద్రాన్ని తలపించే మేఘాలు, సూర్యోదయాన్ని చూసి పులకించిపోయారు. అరకు అద్భుతం అంటూ కొనియాడుతున్నారు.
పర్యాటకులు బొర్రా గుహలు, చాపరాయి జలపాతాలు, పూదోటల అందాలను ఆస్వాదిస్తూ మైమరచిపోతున్నారు. మాడగడలోని ప్రకృతి సోయగం ఇటీవల ఎక్కువగా ఆకర్షిస్తున్న ప్లేస్‌గా ప్రసిద్ది పొందింది. భూతల స్వర్గాన్ని మైమరపించేలా మాడగడ ప్రకృతి సోయగం ఉందని అంటున్నారు. ఇక మార్నింగ్, ఈవినింగ్ టైంలో పర్యాటకులు, క్యాంప్ ఫైర్, గిరిజన సంప్రదాయ నృత్యాలతో ఆనందంగా గడుపుతున్నారు. అరకు అందాలను అనుభవించాలే తప్ప మాటల్లో చెప్పలేమంటున్నారు పర్యాటకులు. బొంగులో చికెన్, అరకు తేనె, వలసిపూల తోటలు, డ్రాగన్ చెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..